ఏది దేవుని వాక్యం బైబిలా ఖురనా

ముందు మాట.
బైబిల్ గ్రంథం చదవడానికీ, గ్రహించడానికి తేలికైనదని తనకు తానుగా ఎన్నడూ చెప్పకోలేదు. బైబిల్ గ్రంథం దేవునిచేత ప్రేరేపించబడినది గనుక దాని సందేశం పవిత్రమైనది, గంభీరమైనది మరియు లోతైన జ్ఞానమును బయలుపరచేదిగా ఉంటుంది. మానవ మేధస్సు పరిశుద్ధాత్మపై ఆధారపడి వాక్యమందు ప్రయాసపడాలి. ఏదిఏమైనా విద్యావిహీనులు, అస్థిరులైన కొందరు తమ స్వీయ నాశనం కోసం బైబిల్ గ్రంథాన్ని తమకిష్టం వచ్చినట్టు వక్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు ( 2 పేతురు3:16 ). అలాంటివారిలో ఒకరు కీ.శే అహ్మద్ దీదాత్. అతడు మరణించినప్పటికీ, అనేకులు అతని రచనలను, ప్రసంగాలను గుడ్డిగా అనుసరిస్తున్నారు. కాబట్టి అతని రచనలను నలుగురి ముందూ పెట్టి, వాటిని ఖండించవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో మనము అపొస్తలుల మాదిరిని ( అపొ.కా.18:28 ) అనుసరించి, వారి హెచ్చరికను పాటించబద్దులమై యున్నాము ( 1 పేతురు 3:15 ).

ఈ పుస్తకంలో సహో.బిబు (ఎల్ ఎల్ ఎమ్) దీదాత్ వాదనల్లోని పసలేనితనాన్ని బయటపెట్టి ఓ న్యాయశాస్త్ర నిపుణుడిగా, బైబిల్ బోధకుడిగా తనదైన శైలిలో బైబిల్ గ్రంథం తరుపున తన వాణిని అద్భుతంగా వినిపించాడు. ఉదాహరణకు, 1 వ అధ్యాయంలో దీదాత్, విట్ వాటర్ శ్రాండ్ అనే విశ్వవిద్యాలయానికి చెందిన ఓ వేదంత విద్యార్థితో చేసిన తన సంభాషణ ఉటంకిస్తాడు. మొదట క్రైస్తవులపై మానసికంగా దాడిచేస్తే, ఆ తర్వాత అతని తప్పుడు తర్కాన్ని, రుజువులను వాళ్ళు కళ్ళుమూసుకొని అంగీకరిస్తారన్నదే దానిని ఉదహరించడంలో దీదాత్ ఉద్దేశం. ఏదిఏమైనా, ఆ వేదాంత విద్యార్థి నిజానికి ఒక వాస్తవిక ద్రుక్పథాన్ని ( ప్రతీ క్రైస్తవునికీ ఉండవలసినది ) కలిగివున్నాడే తప్ప, దీదాత్ ఆరోపించినట్టు మొండి మనస్తత్వాన్ని కలిగినవాడు కాదన్న సంగతిని సహో.బిబు అమోఘంగా చూపించాడు. వాస్తవానికి సహో. బిబు ఈ పుస్తకంలో ఇతర క్రైస్తవ అపాలజిస్టుల వాదనల్నే వల్లెవేసెమనస్తత్వాన్ని అనుసరించలేదు గాని స్వతంత్రంగా అధ్యయనం చేసి, అనేక మూలగ్రంథాలు పరిశోధించి, వివిధ పండితులు అందించిన రుజువులను విశ్లేషించి తన సొంత నిశ్చితాభిప్రాయాలను వెలిబుచ్చడం ద్వారా బైబిల్ గ్రంథాన్ని అమోఘంగా సమర్థించాడు. అటువంటి స్వతంత్ర పరిశీలన, విశ్లేషణ చేసేవాళ్ళని బైబిల్ " ఘనులైనవారు''గా పరిగణిస్తుంది ( అపొ.కా. 17:11).

ఫైగా, బైబిల్ కు ఒక ప్రమాణాన్ని, ఖురానుకు మరొక ప్రమాణాన్ని ఉపయోగించడంలో (ఇతర దావా ప్రచారకులు కుడా దీన్నే పాటిస్తారు) దీదాత్ అనుసరించిన రెండు నాల్కల ధోరణిని కూడ సహో. బిబు పదేపదే బయట పెట్టాడు. అద్బుతమైన ప్రశ్నలద్వారా ఎదుటివారి ఉద్దేశాలను, పక్షపాత ధోరణిని బయట పెట్టడం అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా అనుసరించిన పద్దతి అని పాఠకులు బాగా గుర్తించగలరు (మత్తయి 21:23-27,22:18-22). తరచుగా ముస్లింలతో గాని ఇతరులతో గాని చర్చలు జరిపేటప్పుడు క్రేస్తావులు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోరు. వారి ప్రేశ్నలకు మనం జవాబివ్వడం ఎంత ముఖ్యమై, తియ్యని మాటలతో లేదా సర్వం తెలిసిన పండితుల మాదిరి నటిస్తూ మత్తయి 22:15-22లో ఉన్నట్టు, ప్రజలను చిక్కుల్లో పెట్టడం కూడ ముఖ్యమే. బైబిల్ గ్రంథాన్ని ప్రేశ్నించే ముస్లింలు గాని,లేక మరేవరేనా గాని, వారు నిజమైన అన్వేషకులు, వాస్తవిక దృక్పథంతో ఆలోచించేవారైతే, వారి సొంత విశ్వాసాలను పరీక్షించుకొని, మనం అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి కూడా వాళ్లు సుముఖంగా ఉండాలి.

అంతేకాకుండ, సహో. బిబు బైబిల్ గ్రంధం, తర్కశాస్త్రం, ఖురాన్, హోదిత్లనుంచి తన వాదనలకు కావలసినన్ని రుజువులను ఉదాహరణగా చూపించాడు.జస్టిన్ మార్టిర్ (క్రీ.శ. 100-165), అలెగ్జాడ్రియాకు చెందిన క్లెమెంట్ (క్రీ.శ. 150-216) అలెగ్జాడ్రియాకు చెందిన అథనెసియస్ (క్రీశ. 293-273) మొదలైన ప్రాచిన సంఘ నిరూపణవాదుల నుంచి ఈ మధ్యకాలపు అపాలజిస్టైన కేరళకు చెందిన మహాకవి కె.వి. సైమన్ (క్రీశ. 1883-1944) లాంటి వారి వరకు అందరూ అదేరీతిగా ఇతర మత గ్రంథాలు చదివి, అదేవిదంగా వాటిని ఉపయోగించినవారే. ఈ విషయంలో సహో. బిబు కూడ ఈ ఉద్దండ పండితులైన అపాలజిస్టుల సరసన నిలువదగినవాడు.

క్రైస్తవులు ఈ పుస్తకాన్ని కొని, చదివి, ముస్లిం సోదరులకు కూడ ఇవ్వవలసిన వారై యున్నప్పటికీ, వారు సహో.బిబు అనుసరించిన విధానాన్ని, అంటే విషయాన్నీ సమగ్రంగా చదివి, ప్రశ్నలడిగి,ద్వంద్వ ప్రమాణాలను బయటపెట్టి, వారి వాదనలకు తగిన రుజువులు చూపగలిగే విధానాన్ని అవలంబించగలిగితే ఇంకా బావుంటుంది. ఇదంతా చెయ్యాలంటే దానికి ఏంతో ప్రయాస, త్యాగం అవసరమవుతాయి.

కంటిచూపు లేకపోయినా,సహో,బిబు కేవలం దేవుని కృప, దీవెనల సహాయం తోనే ఇంతటి అమూల్యమైన గ్రంథాన్ని రచించగలిగాడు. ఈ పుస్తకాన్ని నేను మీకు మనస్పూర్తిగా సిఫారసు చేస్తున్నాను. అనేకమంది విమర్శకుల కళ్లు తెరచి, దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథాన్ని క్రైస్తవుల శ్రద్ధగా అద్యయనం చేసేలా వారిని ప్రోస్తాహించునట్లుగా దేవుడు ఈ పుస్తకాన్ని దీవించును గాక!

క్రీస్తు నందు
జెర్రి థామస్
వ్యవస్థాపకులు
సాక్షి అపాలజిటిక్స్ నెట్ వర్క్ ఇండియా

category: