కురాన్ దహన దినం

కొద్ది దినముల క్రితం అమెరికా లోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన టెర్రీ జోన్స్ అనే పాస్టరు గారు తన సంఘముతో కలిసి ముస్లిముల మతగ్రంధమైన కురాన్ ను సామూహికంగా దహించాలని పిలుపునివ్వటం ఆ పిలుపు అమెరికా దేశములోనే కాక మొత్తం ప్రపంచం లోని ముస్లిముల ద్రిష్టిని ఆకర్షించడం దానికి నిరసనలు జరగడం బహుశా మనకందరికీ తెలిసిన విషయమే. ఆయన తలపెట్టిన ఈ పని ని విమర్శిస్తూ చాలా దేశాలనుండి చాలా మంది తమ తమ ఉద్దేశ్యాన్ని బయలుపరిచినట్టు టీవీలా ద్వారా మరియు ఇంటర్నెట్ ద్వారా మనం తెలుసుకొనవచ్చు. పాస్టర్ టెర్రీ జోన్స్ గారి ఉద్దేశ్యం ఏమైనప్పటికీ ఆయన తల పెట్టిన పని క్రైస్తవ దృక్పదం లో అంగీకార యోగ్యమా కాదా అనేది పక్కన పడితే ముస్లిముల సాహిత్యం లో ఇంతకముందే కురాన్ ను దహించడం మనము గమనించవచ్చు. ముస్లిముల నాయకులు కురాన్ ను దహనం చేయటం దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం మనం గ్రహించ గలిగితే ఈ నాడు పాస్టరు గారు దహనం చేయాలనుకున్న పుస్తకం నిజంగా కురానేనా, ఈ మాత్రానికే ఇంత రాద్ధాంతం చేయాలా అన్న ప్రశ్న చదివే వారిలో తప్పక పుడుతుంది. ఇది ఏదో ఎవ్వరికి తెలియని ఒక రహస్యం నేను వ్రాస్తున్నాను అనుకోకండి ఇది ఒక యదార్థం, ఈ యదార్థం నేనో లేక ఇంకెవరో కనుగొన్న సిద్ధాంతం కాదు, స్సక్ష్యాత్తు ముస్లిముల సాహిత్యములైన హద్దీతులలో వ్రాయబడిన చారిత్రాత్మక ఘటనలు.

మొహమ్మద్ మరణానంతరం అబూ బకర్ అనే మొహమ్మద్ యొక్క అనుచరుడు ముస్లిములకు ముఖ్య నాయకుడుగా / ఖలీఫా గా ఎంచుకోబడ్డాడు. ఆయన సన్నిహితుడైన ఉమర్, యమ్మ యుద్ధములో చనిపోయిన చాలామంది “కుర్రా” (కురానును కంటస్తం చేసే వారు) ల విషయమై మాట్లాడుతూ అబూ బకర్ ను కురానును క్రోడీకరించవలసిందిగా విన్నవించుకొన్నాడు . ఎందుకంటె అప్పటికి లిఖిత పూర్వకమైన కురాను అస్తిత్వం లో లేదుకనుక, మొహమ్మద్ వల్లించిన ఆయతులను ఆయన అనుచరులు సైతం వల్లించి దానినే కురానుగా ప్రసిద్ధి చేసెడివారు. యమ్మ అనే యుద్దములో చాలా మంది అలా వల్లించే వారు చనిపోయిన కారణంగా అప్పటి ముస్లిముల నాయకుడైన అబూ బకర్ పై కురాన్ ను క్రోడీకరించే బాధ్యత పడింది. అందుకు అబూ బకర్ నాయకత్వం లో జైద్ బిన్ తాబిత్ కురానును చర్మముపైన, పలకల పైన మరియు ఎముకల పైన వ్రాయించి పొందు పరచడం జరిగింది ( సాహి అల్ బుఖారి వాల్యూం 6 గ్రంధము 60 సంఖ్య 201). అయితే జైద్ బిన్ తాబిత్ కురానును పొందుపరిచే సమయానికే కురానులోని చాలా భాగం నశించింది అన్న విషయం ముస్లిం సాహిత్యం లో వివరించ బడినది. జాన్ బుర్టన్ , కలెక్షన్ ఆఫ్ కురాన్ PP 126 -127 , ప్రకారము చనిపోయిన కుర్రాలతో పాటి చాలా భాగం కురాను నశించిందని ఆ కురాన్ యొక్క ఆయతులు ఇప్పటి కురాన్ లో పొందు పరచ బడ లేదు. ఇదే కోవలో మొహమ్మదే కురాన్ ను కంటత చేసిన వారిలో అతి శ్రేష్టులుగా పరిగణింఛిన ఉబయి బిన్ కాబ్ మరియు అబ్డుల్లః ఇబ్న్ మసూద్ వంటి వేరిరువురు కూడా వారికి తోచినట్టు కురాన్ ను జత కూర్చారు. ఇందు కారణముగా అప్పటి ముస్లిం సముదాయము లో అప్పటికే వాడుకలో ఉన్న కురానులలో వ్యత్యాసాలు ఉండటం ఎవరికి యే కురాన్ నచ్చితే ఆ కురానును వారు వాడటం అందుమూలముగా సమూహముల మధ్య విబేధాలు రావడం జరిగినవి.

ఆ సమయం లో మూడవ ఖలీఫా ఐన ఉత్మన్ కురాన్ పై ఉన్న విబేధాలను పరిష్కరించాలన్న నెపం తో హఫ్సా వద్ద ఉన్న జైద్ బిన్ తాబిత్ కురాన్ ను తెప్పించి ఆ కురాన్ యొక్క పలు ప్రతులను వ్రాయించెను. అయితే అలా వ్రాస్తున్న సమయంలో వ్రాసెడివారు ఏకీభవించని ఆయాతు ఏదైనా గమనిస్తే దానిని కురైష్ యాస లో నమోదు చేయవలసిందిగా ఆజ్ఞాపించెను. అలా వ్రాయించిన కురాన్ ప్రతులను అప్పటి ముఖ్య ముస్లిం కేంద్రాలకు పంపించి వాటిని అధికారిక కురాన్ గా ప్రకటించెను. అంతే కాక అధికారికం కాని కురాన్ ప్రతులను సేకరించి వాటిని తగుల బెట్టెను (ఫత్ అల్ బారి వాల్యూం 9 పేజి 18 ). అలా మొదటి సారి ఉత్మన్ హయాములో కురాన్ ప్రతులు తగులపెట్ట బడ్డాయి.
ఇక ఇది చాలదని జైద్ చె కూర్చ బడిన కురాన్ ను మెదిన ప్రాంత గవర్నర్ అయిన మర్వన్ నాశనము చేయించెను. కితాబ్ అల్ మసాహిఫ్ లో సలీం మాటలాడిన ఈ మాటలను ఇబ్న్ అబూ దావూద్ రచించెను:
హఫ్సా మరణానంతరం మేము ఆమె అంత్య క్రియల నుండి వచ్చు చుండగా మర్వన్ హఫ్సా తమ్ముడైన అబ్డుల్లః బెన్ ఒమర్ వద్దకు ఆమె(హఫ్సా ) వద్ద ఉన్న కురాన్ ను తీసుకురమ్మని పంపెను. అబ్డుల్లః బెన్ ఒమర్ ఆ ప్రతులను పంపగా మర్వన్ వాటిని చింపివేసెను. అప్పుడు అతను ఈ పుస్తకము లో వ్రాసిన ప్రతి విషయము అధికారిక మైన కురాన్ లో కూడా వ్రాసి ఉంది కనుక నేను ఇలా చేసితినని ఎందుకనగా కొన్నిదినముల తరువాత ప్రజలు ఈ ప్రతిలో వ్రాయబడని సంగాతులున్నాఎమో అని అనుమానిన్చుదురు అని చెప్పెను.
ఇలా అబూ బకర్ ( మొహమ్మద్ స్నేహితుడు మరియు మామ) యొక్క అధికారములో వ్రాయబడిన కురాన్ ను మర్వన్ నాశనము చేయించెను. ఇది కురాన్ యొక్క రెండవ దహన సమారోహం.

ఈ విధంగా కురాన్ ను దాని స్వస్తాయి లో ఉంచకుండా తమకిష్టం వచ్చినట్టు వ్రాసుకొని, బేరీజు వేసుకోవాడిని ఆస్కారం లేకుండా దాని మూల ప్రతులను దహనం చేయించిన ముస్లిం నాయకులు గొప్ప వారు కావడం శోచనీయం. పాస్టర్ టెర్రీ జోన్స్ గారు కురాన్ ను తగులబెట్టినంత మాత్రాన ఇస్లాం మతానికి కానీ మరే యితర మతాలకు కానీ వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ముస్లిం నాయకులు మతం ముసుగులో కురాన్ మూల ప్రతులను తగులబెట్టటం మాత్రం ఇస్లాం మతానికి తీరని లోపమేకదా. పాస్టరు గారు చివరికి కురాన్ ను బహిరంగంగా తగులబెట్టటం నిలిపి వేసారు అయితే ముస్లిములు ఆలోచించ వలసిన విషయం ఏమిటంటే పాస్టర్ టెర్రీ జోన్స్ తగులబెట్టాలనుకున్నగ్రంధం నిజంగా కురానేనా? ఆ పుస్తకం అసలైన కురాన్ అని అనడానికి వారి వద్ద ఏమైనా ప్రమాణం ఉందా? ముస్లిం సాహిత్యాలు నొక్కి వక్కాణించే పై చెప్పబడిన సత్యాల మాటేమిటి?

category: