తకియ్య

1400 ఏళ్ళ పైచిలుకు వయసు గల ఇస్లాం మతము ఆ మతమును అనుసరించే వారికి ఇచ్చిన సదుపాయాలలో మత పరముగా పనికొచ్చే సదుపాయం తకియ్య!
ఈ సిద్ధాంతము ప్రకారం మిస్లుములు క్లిష్ట పరిస్థితులలో ఉన్నపుడు వారి మతమును, బయటకు విస్మరించి మనసులో వారి విశ్వాసమును నిలుపుకోవచ్చు. ఇది కేవలము మతమును దాచిపెట్టేందుకు మాత్రమే కాక జీవితములోని అన్ని కోణాలలో కూడా దీనిని ఉపయోగించ వచ్చు అని ఇస్లాం పండితులు చెబుతున్నారు. ఈ ఆచారము ప్రకారము మోసపూరిత అబద్ధములు ఆడటానికి కూడా అనుమతి ఉంటుంది. ఇస్లాం మతము లో సత్యమును దాచి పెట్టటం మరియు అబద్ధములాడటం అనుమతిన్చనట్టుగా ఉంటుంది సురా 2:42
అయితే ఈ సూత్రముకు గల మినహాయింపు చాలా మందికి నిజమైన సూత్రముగా నిలిచి పోయింది. ఆ విషయమునే ఈ వ్యాసములో సమకూర్చటానికి ప్రయత్నిస్తాను.
సత్యమును దాచి పెట్టడం మరియు అబద్ధం చెప్పడం ఇస్లాం మతములో తప్పే అయితే ఈ సూత్రము ముస్లిములు తమ మతానుసారముగా కొన్ని ఉన్నత మైన ఆశయాలను నెరవేర్చేందుకు అబద్ధం ఆడవచ్చు, సత్యం దాచి పెట్టవచ్చు అలాగే మోసము కూడా చేయ వచ్చు. ఈ సిద్ధాంతానికి నాంది కురాన్ లోని సురా 16:106.
“ఎవరైనా దేవుడిని ఆయన ప్రవక్త ను విశ్వసించాక ఒత్తిడి బలప్రయోగాల వల్ల అవిశ్వాస ధోరణి వ్యక్తం చేస్తే, అప్పుడతని హృదయం మాత్రం విశ్వాస స్థితి లోనే ఉంటె అలాంటి వ్యక్తి పై దోషము లేదు”
ముస్లిముల సంఖ్య తక్కువగా ఉండి వారి బలము తక్కువగా ఉన్న సందర్భాలలో ముస్లిములు వారి విశ్వాసమును తప్పుగా అగుపరిచి అవిశ్వాసులను మోసపుచ్చేందుకు వారికి అనుమతి కలదు. వారి విశ్వాసమును సంపూర్ణముగా లేనట్టుగా కూడా చెప్పటానికి వారికి పై సురా అనుమతి నిస్తుందని ముస్లిముల అభిప్రాయము. ముస్లిముల లో అతి ప్రాముఖ్య మైన వ్యాఖ్యానం గా పిలువబడే ఇబ్న్ కతీర్ యొక్క వ్యాఖ్యానము లో ఈ విషయము స్పష్టముగా చెప్పారు. సురా 16:106 గురించి చెప్పబడిన వ్యాఖ్యానము:” మక్కా లోని అనచివేయబడుతున్న ముస్లిములను ఉద్దేశ్యించి ఈ ఆయాతు చెప్పబడింది. వీరు తమ విరోదులకంటే నీరసముగా ఉన్నారు కనుక తమ విరోధులు వీరిని కష్ట పెట్టినప్పుడు వారితో అంగీకరించి వారితో వెళ్ళారు. కాని అల్లాః వారి హృదయములను పరీక్షించిన తరువాత పునరుత్తానులయిన తరువాత జరుగ బోవు తీర్పు లో వారిని క్షమిస్తాడు”
ఈ విషయము యొక్క నేపధ్యం గురించి ఇస్లామీ సాహిత్యం ఈ విధంగా అంటోంది: “అమ్మార్ ఇబ్న్ యాసీర్ అనే వ్యక్తిని అవిశ్వాసులు స్వాధీనపరచుకుని మొహమ్మద్ ప్రవక్త గురించి చెడు పలుకులు పలక మని మరియు వారి దేవతలను పొగడమని ఒత్తిడి చేసి అతను ఆ విధముగా చేసిన తరువాత విడుదల చేసిరి. అప్పుడతను తిన్నగా ప్రవక్త వద్దకు వెల్లెను. ప్రవక్త ‘నీ మనసు లో ఏమైనా ఉన్నదా’ అని అడుగాగా ‘చెడు వార్త’ అని అమ్మార్ జవాబు చెప్పి ‘నేను మిమ్మును తిట్టి వారి దేవతలను పొగిడెంత వరకు వారు నన్ను విడుదల చేయలేదు’ అని చెప్పగా ‘నీ హృదయము ఎలా ఉన్నది’ అని ప్రవక్త అడిగెను అందుకు అమ్మార్ విశ్వాసములో నిశ్చలముగా ఉంది అని చెప్పెను అప్పుడు ప్రవక్త ‘వారు తిరిగి నీవద్దకు వచ్చినపుడు అలాగే మళ్ళీ చేయుము’ అని చెప్పి సురా 16:106 ను బయలు పరచెను” (Confirmed by At-Tabari and narrated by Abd al-Razak, Ibn Sa’d, Ibn Jarir, Ibn Abi Hatim, Ibn Mardawayh, al-Bayhaqi in his book “al- Dala-il,” http://www.al-islam.org/encyclopedia/chapter6b/1.html)
ఈ సమాచారము ప్రకారము మొహమ్మద్ గారు తన అనుచరులను తమ విశ్వాసమును దాచుకుంటూ నైనా సరే అవిశ్వాసులను మోస పుచ్చ్చ మని ప్రోత్సహించి నట్టుగా కనబడుతోంది. ఇదే మాటను ముస్లిముల చే గౌరవముగా స్వీకరించ బడే ఇబ్న్ అబ్బాస్ కూడా ఈ విషయమును అంగీకరిస్తూ “తకియ్య కేవలము పెదవులతో పలుకుటే కానీ హృదయము విశ్వాసము తో నిండి ఉండాలి” ఈ సందర్భములు ఎదురవ్వకుండా నే బహుశా కురాన్ అన్య మతస్థులను స్నేహితులుగా తీసుకోకండి అని బోధిస్తుంది, సురా 3:28.
ఇలాంటి మోసము ముస్లిమేతరులపై ధనార్జన కొరకు కూడా చేయవచ్చు అని ముస్లిము సాహిత్యములు చెబుతున్నాయి. అలాగే ఇస్లాం యొక్క విరోధులను చంపటానికి కూడా మోసమును ఉపయోగించేందుకు అనుమతి గలదు.
బైబిల్ మరియు యేసు మాత్రం మోసమును ససేమిరా ఒప్పుకోరు. అలాచేయమని బైబిల్ కానీ యేసు కాని ఆజ్ఞాపించరు లేక సలహా కూడా ఇవ్వరు.
“మన మతము లోని విషయాలను బయట పెట్టేవాడు మనలను నిజానికి చంపెవాడు” అనేది ముస్లిం పండితుల ఆలోచన “Hadith Imam Jafar Sadiq Footnote. #1 Usool al Kafi, p.88″.
ఇంకో సందర్భములో కూడా మొహమ్మద్ గారిని అవమాన పరిచిన కారణము గా మొహమ్మద్ గారి అనుచరుడైన ముసలమ అనే వ్యక్తి కాబ్ బిన్ అల్ అష్రఫ్ అనే వ్యక్తిని చంపటానికి వెళుతూ నన్ను ఒక అబద్దం ఆడనివ్వుము అని అడుగగా మొహమ్మద్ గారు అనుమతించారు అని బుఖారీ వాల్యూం 5, పుస్తకం 59, 369 సంఖ్య లో జాబిర్ బిన్ అబ్దుల్లా అనే వ్యక్తి ద్వారా చెప్ప బడినది.

కనుక ఇస్లాం మతము యొక్క నిజ స్వరూపం ఇస్లామీ శరియ్యా ద్వారా ఏలబడుతున్న రాజ్యాలలోనే తెలుస్తుంది కానీ మిగితా దేశాలలో చూసేది కేవలం ఒక కోణం మాత్రమే అన్నది చదివే వారు గుర్తుంచు కోవాలి.
మనము చూసేది వినేది అన్తాకూడా నిజము అని చెప్పలేము. ఎందుకంటే అలా తమ మతమును ఎలా గైనా అగుపరచుకొనే అవకాశం ముస్లిములకు వారి సాహిత్యం ఇచ్చింది కనుక.
కనుక ఇస్లామీ ప్రచారకులు చెప్పే చాలా విషయాలలో తకియ్య ను గుర్తుంచుకొని వాటిని వినాలి. శాస్త్రీయముగా ఒక విషయము పట్ల ఇస్లాం మతము ఏకీభవించక పోయినా ఆ మత ప్రచారకులు మాత్రం ఎకీభవిస్తోంది అని చెప్పే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అలా బొంకటం వారికి ఇవ్వబడిన సదుపాయము కనుక. ఉదాహరణ కు ఇస్లాం శాంతియుతముగా అన్ని మతాలతోనూ కలిసి ఉంటుంది అని చెప్పే జాకీర్ నాయిక్ వంటి బోధకులూ ఉన్నారు. వారు అలా చెప్పినంత మాత్రాన అది నిజం కాదు. ఎందుకంటే అన్య మతస్తులు అల్లాః మాత్రమే దేవుడు అని చెప్పేంత వరకు మొహమ్మద్ గారు ప్రవక్త అని ఒప్పుకునేంత వరకు వారి తో పోట్లాడాలని కురాన్ ముస్లిములను ఆజ్ఞా పిస్తుంది. “నేను మీ వెంట ఉంటాను, మీరు విశ్వాసులను స్థిరంగా ఉంచండి. నేను కూడా అవిశ్వాసుల గుండెల్లో భయం పుట్టిస్తుంటాను కనుక మీరు వారి మెడలపై కాళ్ళ పై వ్రేటు వేస్తూ ఉండండి, కారణం వారు దేవునిపై, ప్రవక్త పై తిరగ బడ్డారు” సురా 8:12
“పవిత్ర మాసాలు ముగిసిపోగానే బహుదైవారాదీకులను ఎక్కడ కనిపిస్తే అక్కడ వధిన్చండి” సురా 9:5
ఈ ఆయాతు “ఖడ్గము” అని పిలువబడినది. ఎందుకంటే ఈ ఆయాతు మొహమ్మద్ ప్రవక్త కు మరియు విగ్రహారాదీకులకు మధ్య ఉన్న అన్ని శాంతి ఒప్పందాలను లయము/రద్దు చేసింది కాబట్టి. ఈ విషయాన్ని తఫ్సీర్- ఇబ్న్ – కతీర్ లో మనము ఈ ఆయతుకు గల వ్యాఖ్యానము లో చెప్పబడి ఉంది.
దీనిని ఇస్లామీ ప్రచారకులు సంపూర్ణముగా చెప్పరు, అందుకు కారణం వారికి వసతిగా ఉన్న తకియ్య అనే ఈ సిద్ధాంతమే!

category: