మా గురించి

మేమెవరము?

సాక్షి: భారత దేశపు అపోలోజెటిక్ నెట్వర్క్ (SAN) ప్రభువైన యేసు క్రీస్తు చే అప్పగింప బడిన సువార్త పనిని లేఖనములలో చెప్పబడిన విధముగా అపోలోజెటిక్ పద్ధతిని ఉపయోగించి జరిగించుటకు కూడివచ్చిన క్రైస్తవ యువజన సమూహం.

జీవితములోని వివిధ రంగాలలో సత్యమును శోదించుటకు మరియు దాని సాక్షి గా నిలుచుటకు సంకల్పం చేపట్టిన ప్రతి క్రైస్తవునికి SAN ఒక మంచి వేదిక వంటిది. సర్వ సత్యము మనలను సర్వ సృష్టికి కారణ భూతుడు మరియు దానిని సంరక్షించువాడు అయిన దేవుని వద్దకు నడిపిస్తుంది అని మేము నమ్ముతాము. ఈ సత్యము “నేనే సత్యమును అని చెప్పిన” యేసు క్రీస్తు అనే ఒకే ఒక్క మనుష్యుని రూపము లో మనకు బయలు పరచ బడింది అన్నది మా విశ్వాసమునకు ఆధారము.

కొన్ని దృక్పదాలు సత్యములని మరికొన్ని సత్యములు కాదు అని మా విశ్వాసము. మా ద్రుక్పదములకు వ్యతిరేకములైన ద్రుక్పదములు కలిగి ఉన్న వారి వద్ద నుండి విని నేర్చుకొనుటకు మేము సంసిద్ధమే. విహితమైన సంభాషణ మరియు పర్యా లోచన చే కూడిన భావ ప్రకటన ద్వారా వివిధ ద్రుక్పదములను సమాలో చించుటకు మేము సిద్ధము. మాకు తెలియనిది మేము తెలుసుకోవలసినది చాలా ఉన్నది అని మా విశ్వాసం. అయితే మాకు తెలిసినంత సత్యం మానవ మనుగడ, జీవన పరమార్థం మరియు ఉద్దేశ్యం తెలుసుకోవటానికి చాలినదని మా విశ్వాసం. SAN సత్యమును తెలియచేయుటకు నిబద్ధత కలిగి ఉన్నది.