మా దర్శనము మరియు విలువలు

1) సువార్త పరిచర్య కొరకు అపోలోజేటిక్స్
(a) తర్కము, చర్చ, డిబేట్, బహిరంగ వేదిక మరియు సంవాదము మొదలగు చైతన్య కార్యముల ద్వారా బహిరంగ ప్రదేశాలలో కానీ, ఆధ్యాత్మిక సభలలో కానీ, విద్యా పీటములలో కానీ గృహములలో కానీ చెరసాలలో కానీ ప్రేషిత సువార్త పరిచర్య వివిధ మాధ్యమముల ద్వారా చేయటం .(అపో:9:22, 9:29, 17:2, 18:4, 18:19, 18:24, 18:28, 19:8-10, 28:30)

(b) సమాజములో గల బుద్ధికుశలత కు సంబంధించిన అవసరతలు, ప్రశ్నలకు సమాధానములు చెప్పి, ప్రతి వితర్కమును, ఆలోచనను పడద్రోసి క్రీస్తు సువార్త ప్రజలకు అంగీకారయోగ్యముగా అందచేయడం. 2 కొరింథీ 10:5

2) క్రైస్తవులు వారి ప్రాంతీయ అవసరతలకు అనుగుణముగా అపోలోజేటిక్స్ ద్వారా సువార్త పరిచర్య చేయటానికి అవసరమైన తర్బీదు ఇవ్వటం (ఎఫెస్సీ 4:12):

• క్రీస్తునందున్న నిరీక్షణ ను గురించి తర్కములడిగే ప్రేతి ఒక్కరికీ సమాదానమిచ్చు లాగున క్రైస్తవులు సంసిద్ధులై ఉండటానికి తగు తర్ఫీదు ఇవ్వటం (1 పెటురు :15).

• క్రైస్తవులను పరిశోధించుటకు ప్రేరేపిస్తూ తద్వారా నిర్మల బుద్ధి కలిగి సత్యమును, ఘనమైన, శుద్ధమైన, ప్రేమించదగిన మరియు ప్రశంసించ దగిన శ్రేష్ఠ మైన విషయములను ఆలోచింప జేయుట.(అపో 17:11, 1 తేస్సలో 5:21, ఫిలిప్పీ 4:8)

•క్రైస్తవులకు ఆధ్యాత్మిక క్రమశిక్షణలో తర్బీదు నివ్వటం ద్వారా తర్క సంబంధమైన బుద్ధి కుశలత వెనుక ఉన్న ఆత్మ సంబంధమైన యుద్దమును బయలు పరచటం.

3) భాగ స్వామ్యం మరియు నెట్వర్క్

(a) సువార్త పరిచర్య మరియు తర్బీదు కార్యక్రమాలు చేపట్టటానికి ఇతర క్రైస్తవ సంఘాలు, సంస్థలు మరియు వ్యక్తులతో జత పని వారముగా భాగస్వామ్యం పొందుట.

(b) ప్రాంతీయ అపోలోజేటిక్ సమూహములను నిర్మించుటకు మరియు సాక్షి పేరు తో గాని ఇతెర ఏ పేరుతో నైన సువార్త పరిచర్య చేయటానికి మరియు తర్బీదు కార్యక్రమాలు చేపట్టటానికి తగు అనుభావాత్మక నైపుణ్యమును అందించుట.

(c) క్రీస్తు సువార్త సన్నగిల్లే లా రాజీ పడకుండా ఉండే ఎవరితోనైనా SAN యొక్క దర్శనమును పంచుకొని పెంచుకోవటానికి సంసిద్ధముగా ఉండుట.

ప్రాముఖ్యమైన విలువలు:

• దేవునికి మహిమ: SAN యొక్క అన్ని ప్రణాళికలలో దేవుని రాజ్యమును మరియు ఆయన నీతిని వెదుకుత.

• బైబిల్ యొక్క ఆధిపత్యం : SAN తీసుకొనే అన్ని నిర్ణయాలూ బైబిల్ గ్రంధ ఆధిపత్య పరిధి లోనే ఉండేలా నిబద్ధత.

• పారదర్శకత : పారదర్శకముగా ఒకరికొకరు బాధ్యతా యుతముగా సంపూర్ణ యదార్థత తో పనిచేయుట.

• పరస్పరాధీనత : తోటి విశ్వాసులతో కలిసి దర్శనమును మరియు ప్రణాలికను జరిగించుట.

• ప్రేమ:: బైబిల్ ఉపదేశానుసారం మరియు క్రీస్తు ఉదాహరణ ప్రకారం పొరుగువారి మేలుకోరకై ప్రేమపూర్వకముగా నిబద్ధత కలిగి పనిచేయటం.