మా విశ్వాసము

పాతనిబంధన గ్రంధములో గల 39 పుస్తకములు మరియు నూతన నిబంధనలో గల 27 పుస్తకములు కలిసిన బైబిల్ గ్రంధము దేవుని చే మనవులకోరకు ఇవ్వబడిన ప్రేరేపిత, మార్పుచెందని, ఏకైక ఆఖరు దైవ గ్రంధము అన్నది మా విశ్వాసం. బైబిల్ గ్రంధము విశ్వాస యోగ్యమైనది, ఆదినుండి గల వ్రాత ప్రతులలోని అన్ని బోధలలో ఏ లోపము లేనిది అని మరియు మానవ జీవనశైలికి తగిన అధికారిక మైనది అని మా విశ్వాసం.

నిజమైన దేవుడు కేవలం ఒక్కడే నని, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అను ముగ్గురు వ్యక్తులు గా కాల పరిమితిలోను, కాల పరిమితిలేనప్పుడునూ, యుగ యుగములూ, భూమ్యాకాశముల సృష్టికి ముందునూ తరువాతనూ, నూతన భూమ్యాకాశముల శ్రుష్టి యందునూ , సదాకాలము అస్థిత్వములో ఉన్న వాడని మా విశ్వాసము.

దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సశరీర ధారి అయి, సంపూర్ణ మానవునిగానూ మరియు సమూర్ణ దేవునిగానూ కన్య మరియ గర్భములో పరిశుద్ధఆత్మ శక్తి ద్వారా జన్మించి పాప రహిత పరిశుద్ధ జీవితమును జీవించి, గొప్ప ఆశ్చర్య కార్యములు చేసి, పొంతి పిలాతు రాజ్యములో శ్రమ పొంది సిలువ పై రక్తమును కార్చి, త్యాగ భరితమైన, జయవంతమైన, పాప పరిహారార్థ బలిగా సిలువ మరణము ను పొంది మూడవ రోజు సశరీరునిగా మూడవ రోజు పునరుత్తానుడై లేచి తన శిష్యులు చూస్తుండగా పరలోకమునకు ఎత్తుకోబడి తండ్రి యైన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి తిరిగి శక్తి తోను, మహిమలోను, మరణించిన వారికి, జీవించి ఉన్న వారికి తీర్పు తీర్చుటకు తన సనాతన రాజ్యమును స్థాపించుటకు తిరిగి రానై యున్నాడు అని మా విశ్వాసము.

దేవుని స్వరూపము లో చేయబడిన మనుష్యులు అందరు, స్త్రీలు, పురుషులు అన్న బేధం లేకుండా మొదటి తల్లి దండ్రులైన ఆదాము హవ్వల పాపము కారణముగా జన్మతః పాపులు అని తరువాత వారి వారి ఇష్టానుసారము గా పాపము చేసి దేవుడనుగ్రహించిన మహిమకు దూరమై దేవుని ఉగ్రత మరియు ఆయన తీర్పుకు అర్హులయ్యారు అన్నది మా విశ్వాసం.

పాపములను క్షమించగల యేసు క్రీస్తు పై మాత్రమే విశ్వాసముంచటము వలన ఆయన నామమున పశ్చాతాప పడుట వలన మనుష్యులకు పాపము నుండి విముక్తి మరియు నిత్య జీవము ఉపహారముగా విస్వాసముద్వారా ఇవ్వబడును అన్నది మా విశ్వాసము.

పరిశుద్ధాత్ముడు మాత్రమే మానవులలో పాపము నిమిత్తమై పశ్చాతాపము కలిగించి వాటిని యేసు క్రీస్తు వద్ద ఒప్పుకుని ఆయనను తమ ప్రభువుగా స్వీకరించే లా చేసి ఆధ్యాత్మిక జీవితమును ప్రసాదించగలడు అన్నది మా విశ్వాసం. ఆయన పాప క్షమాపణ పొంది యేసు పై విశ్వాసముంచిన ప్రతి విశ్వాసి లోను వసియిస్తూ దేవునికి మహిమ కరమైన విధేయత గల జీవితమును జీవించే లా చేయ గల సమర్థుడు అన్నది మా విశ్వాసం.

మానవులందరూ సహజసిద్ధంగా ఒకటేనని దేవుని స్వరూపం లో సృష్టించబడ్డారని పాపము అన్న అవిధేయత కారణముగా ఆయనకు దూరమయ్యారని మా విశ్వాసము. అదే విధముగా యేసు ద్వారా రక్షణ పొందిన విశ్వాసురందరూ ఆయన ఆత్మీయ శరీరములో పాళీ భాగాస్తులని ఒకే ఆత్మీయ కుటుంబములో సదస్యులని మా విశ్వాసము.

మరణించిన వారందరూ దేవుని తీర్పుదినమున పునరుత్తానులవుతారని మా విశ్వాసము. యేసు నందు విశ్వాసముంచని వారు సదాకాలము దేవునికి దూరముగా నరకమునకు పాత్రులవుతారని అలాగే యేసునందు విశ్వాసముంచు వారు దేవునితో పరలోకములో సదాకాలము ఉంటారని మా విశ్వాసము.