ఇస్లాం మరియు విగ్రహారాధన

ఇస్లాం మతము లో విగ్రహారాధన పాపము అయినప్పటికీ మహమ్మద్ గారు విగ్రహారాధన చేసిన దాఖలాలు కనబడుతున్నాయి.

ఇస్లాం ఆచారాలలోని అధిక భాగము అరేబియా లోని విగ్రహారాదీకుల ఆచారములనుండి వచ్చినవే. మహమ్మద్ గారు ఖుర్ఆన్ ను ప్రకటించకముందు, ప్రకటిస్తూ, మరియు తన మిగతా జీవితమంతటిలో ఈ అన్య దేవతల ఆచారాలు పాటించినట్టు మనము చూడగలము. ఉదాహరణకు బుఖారి రచించిన హద్దీత్ లో మహమ్మద్ గారు తన పిలుపుకు ముందు అన్య దేవతలకు బలులు అర్పించుట గురించి నమోదు చేసాడు.

అబ్డుల్లః వ్యాఖ్యానము:” అల్లాహ్ ప్రవక్త జైద్ బిన్ అమ్ర్ నుఫిల్ ను బల్దః అనే ప్రదేశము కు దగ్గరగా అతనికి దైవ ప్రకటన ఇవ్వబడక ముందే కలిసెను. అల్లాహ్ ప్రవక్త తనకు అన్యులు ఇచ్చిన మాంసమును జైద్ ముందు ఉంచగా దానిని తినుటకు జైద్ ఒప్పుకొనక ఆ అన్యులతో “నేను మీరు మీ రాతి బలిపీటముల ముందు అర్పించిన వాటిని తినను. అంతే కాదు అల్లాహ్ నామము లో అర్పించని యే మాంసమును నేను స్వీకరించనని చెప్పెను”. (సాహి అల్ బుఖారి 7 : 407 )

పై వ్యాఖ్యానము ద్వారా మనకు అర్థం అయ్యేది ఏమిటంటే, విగ్రహారాదీకులు తినే, అన్యదేవతలకు బలి అర్పించబడిన మాంసమును జైద్ స్వీకరించకపోగా మహమ్మద్ గారు ఆ భోజనమును తినేవాడు అని.

ఇదే దిశలో అల్ఫ్రెడ్ గిలామే, మొట్టమొదటి ముస్లీం హదిత్ కర్త అయిన ఇబ్న్ ఇషాక్ రచించిన ఈ హద్దిత్ ను తన గ్రంథములో నమోదు చేసాడు

అల్లాహ్ ప్రవక్త ఈ విధముగా చెప్పెనని నాకు తెలుపబడెను: అల్లాహ్ ప్రవక్త జైద్ బిన్ అమ్ర్ బిన్ నుఫిల్ గురించి మాట్లాడుచు ” అతను నన్ను విగ్రహారాధన చేయకుండా ఉండవలెను అని సూచించిన వారిలో మొట్ట మొదటి వాడు” అని చెప్పెను .

నిజానికి మహమ్మద్ గారి యొక్క విగ్రహారాధన అల్లాహ్ ప్రవక్తగా మారిన తరువాత కూడా కొనసాగినది. ఇబ్న్ ఇషాక్ (మొట్టమొదటి ముస్లీం జీవిత చరిత్ర కారుడు) తన గ్రంథములో మహమ్మద్ యొక్క కలయిక గాబ్రియేలుతో జరిగిన తరువాత జరిగిన ఈ సన్నివేశము ను నమోదుచేసెను .

” అల్లాహ్ ప్రవక్త తన ఒంటరి సమయమును ముగించుకొని మెక్కాకు తిరిగి వచ్చిన తరువాత మొట్టమొదటిగా కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసెను. అలా చేయు సమయములో వరాకా మొహమ్మదును కలిసి ” నా సోదరుని పుత్రుడా నీవు ఏమి చూసితివో, వింటివో నాతో చెప్పుము: అనెను. ( సీరత్ రసూలల్లః, అల్ఫ్రెడ్ గిలామే అనువాదము పేజీ 107 )

మనము గుర్తించవలసిన విషయం ఏమిటంటే మహమ్మద్ గారి యొక్క జీవితకాలములోని ఈ సమయములో అబ్రాహాము కాబాను నిర్మించెనన్న ప్రకటన ఇంకా వెలువడలేదు. అప్పటి మహమ్మద్ గారి దృష్టిలో కాబా కేవలము అన్య దేవతల కొరకు నిర్మించబడిన ఒక కట్టడము.

ముస్లీములు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తూ కాబాను అబ్రాహాము మరియు ఇస్మాయేలు కలిసి నిర్మించిరి అని ప్రచారం చేయసాగిరి. అలా చేయడము వలన మహమ్మద్ గారి యొక్క ప్రచారముకే నష్టమన్న సంగతి వారు మరిచిపోతున్నారు. ఉదాహరణకు ఇబ్న్ ఇషాక్ వ్రాసిన జీవిత చరిత్రలో కొందరు యూదుల మత గురువులు ( రబ్బీలు ) కాబాను అబ్రాహాము నిర్మించెను అన్న సంగతి రాజుకు చెప్పినట్లు నమోదు చేయబడినది.

“ఆ రబ్బీలు రాజుతో …’మాకు ఆ మందిరము తప్ప ఈ ప్రాంతములో వేరే ఏ కట్టడమూ దేవునిచే ఎన్నిక చేసుకొన బడినదిగా తెలియదు, వారి సలహాను త్రోసేస్తే నీవు, నీ రాజ్యము నశించిపోతుంది. అందుకు రాజు అక్కడికి చేరిన తరువాత నేనేమి చేయవలెను అని అడుగగా, మెక్కా లోని ప్రజలు యే విధముగా అయితే దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో, దానిని గౌరవిస్తారో, తలనీలాలు సమర్పించుకుంటారో, నమ్రతతో ఆ పరిసరాలలో ప్రవర్తిస్తారో, అదే విధముగా చెయ్యమని సలహా ఇచ్చిరి. అందుకు రాజు మీరు అలా ఎందుకు చెయ్యరు అని అడుగగా వారు, ఆ మందిరము తమ తండ్రి అబ్రాహాము నిర్మించినదే అయినప్పటికీ దాని చుట్టూ అక్కడి వాసులు ఉంచిన విగ్రహములు, వారు చిందించే బలుల రక్తము ఒక తీయలేని అడ్డంకుగా ఉన్నది అని ఉత్తరమిచ్చిరి. వారు అపవిత్రులైన అన్య దేవతల ఆరాధీకులు అని కూడా చెప్పిరి.”(అల్ఫ్రెడ్ గిలామే అనువాదము పేజీ 8 -9 )

ఒకవేళ ఈ కథనము సరి అయినదే అయినప్పటికీ ఆ కథనమును వివరించిన యూదులే కాబా చుట్టూ ప్రదక్షిణలు చేయుటకు తిరస్కరించారు ఎందుకంటే దాని చుట్టూ విగ్రహములు ఉన్నాయి కనుక. అల్లాహ్ ద్వారా ప్రకటనలు పొందే అతి శ్రేష్టుడైన ప్రవక్తకు ఆ ఇంగితము కూడా లేదా? ఇది చాలదని మహమ్మద్ గారికి ఒక సురా వెలువడింది అందులో కాబా చుట్టూ ప్రతి ముస్లీం ప్రదక్షిణలు చెయ్యాలి అని సూచించడం జరిగింది. సురా 2:158.

సురా 2:158 “ నిస్సందేహముగా సఫ, మర్వహ్ అల్లాహ్(ధర్మ) చిహ్నములుగా ఉన్నవి. మరియు ఎవరైతే కాబ యాత్ర(హజ్) చేసెదరో, లేక ఉమ్ర చేసెదరో, వారు ఈ ( సఫ, మర్వహ్) రెండింటి మధ్య ప్రదక్షిణలు చేయవలెను. వీరిపై ఎటువంటి పాపము ఉండదు…………. ”

మక్కాలోని సఫా మరియు మర్వా అనే కొండలు ఒకప్పుడు అరబ్ అన్య దేవతలలో ఇద్దరి ఇల్లులుగా చెప్పుకొనేవారు. ఆ దేవతల విగ్రహాలు సైతం అక్కడ ఉండెడివి. అలాంటి సమయములో మహమ్మద్ గారు సఫా మరియు మర్వాలను అల్లాహ్ యొక్క చిహ్నములుగా ఎలా వర్ణించగలడు. అది విగ్రహారాధన కాదా? ఈ అరబ్ దేవతల ఆచారము మూలముగానే ముస్లీములు ఆ కొండల మధ్య పరుగెత్తడానికి సంశయించేవారు.

ఉర్వా వివరణ: నేను నేను ఒక యవ్వన బాలుడనుగా ఉన్నప్పుడు అయెషాతో ( మహమ్మద్ యొక్క భార్య ) ఈ విధముగా అంటిని – ” సఫా మరియు మర్వా (మక్కా దగ్గర ఉన్న రెండు కొండలు) ఖచ్చితముగా అల్లాహ్ యొక్క చిహ్నములు” అనే అల్లాహ్ వాక్యమును నీవు యే విధముగా వివరించెదవు:

“సఫా మరియు మర్వా (మక్కా దగ్గర ఉన్న రెండు కొండలు) ఖచ్చితముగా అల్లాహ్ యొక్క చిహ్నములే “

కాబట్టి (అల్లాహ్ నివాసమునకు వెళ్ళుట ) హజ్జ్ ను ఆచరించువారికి, లేదా ఉమ్రా ఆచరించేవారికి ఆ రెండింటి మధ్య (సఫా మరియు మర్వా ) పరుగెత్తుట హానికరము కాదు. నా ఉద్దేశ్యములో ఆ కొండల మధ్య పరుగెత్తకపోతే అదేమీ పాపము కాదు.

అందుకు అయిషా ‘నీ వివరణ సరయినది కాదు నీ ప్రకారము ” అల్లాహ్ నివాసమునకు హజ్జ్ కు వెళ్ళే వారికి , ఉమ్రా చేయు వారికి తవాఫ్ (కొండల మధ్య పరుగెత్తుట) చేయక పోయినా హాని లేదు” అని ప్రవచనం ఉండాలి. కానీ ఈ వచనము అన్సార్ ను ఉద్దేశించి ప్రవచింపబడినది. వారు ( అన్సార్ ) ఇస్లాంకు ముందు ఇహ్రాంను అనుసరించిన తరువాత, కదిద్ ( మెక్కాలో ఒక ప్రదేశము) లో ఉన్న మనత్ ( ఒక విగ్రహము ) ను దర్శించేవారు. వీరు ఇస్లాంను స్వీకరించిన తరువాత ఆ కొండల నడుమ పరుగెత్తడము/ తిరుగుట :పాపముగా పరిగణించారు . ఇస్లాం వచ్చిన తరువాత వారు అల్లాహ్ ప్రవక్తను ఈ విషయమై అడుగగా ( సురా 2 : 158 ) ప్రవచింపబడినది.

సురా 2 : 158 నిశ్చయముగా ‘సఫా మరియు మర్వా లు అల్లాహ్ చూపిన చిహ్నాలు. కావున ఎవడు (క’బహ్) గృహానికి హజ్జ్ లేక ఉమ్రా కొరకు పోతాడో, అతడు ఈ రెండింటి మధ్య (స’యీ) చేస్తే అతనికి ఎట్టి దోషం లేదు…… మహమ్మద్ గారు ఈ విధముగా విగ్రహారాధనను ఇస్లాం పేరుతో/ముసుగులో వృద్ధి పరిచాడని చెప్పాలి. sahi al bukhari book 6 volume 60 hadiths 22.23

ఈ విధంగా అన్య ఆచారాలను ఇస్లాం లో పాటించేలా చేసిన ఘనత మహమ్మద్ గారికే దక్కుతుంది. ఉదాహరణకు తలనీలాలు ఇవ్వడం తమ పూర్వీకుల స్తుతి బదులుగా అదే శైలిలో అల్లాహ్ స్తుతి చేయమని సూచన 2 :200

నల్ల రాతిని ముద్దు పెట్టు కోవడం . అబిస్ బిన్ రబియా ప్రకారముగా “ఉమర్ వచ్చి నల్ల రాతిని ముద్దు పెట్టుకొని, నీవు కేవలము రాతివి, నీవు ఎవరికీ మేలు చేయలేవు మరియు కీడు కూడా చయలేవు. అల్లాహ్ ప్రవక్త నిన్ను ముద్దుపెట్టుకోవడం నేను చూసి ఉండకపోయి ఉంటే నిన్ను నేను ముద్దు పెట్టుకొనే వాడినే కాదు అని పలికెను” (సాహి అల్ బుఖారి 2:667 ) నల్ల రాతిని ముద్దు పెట్టుకొనడం లో ఉమర్ యొక్క ఈ అయిష్టం ఎందుకంటే అరబ్ అన్యులు కూడా ఇదే విధముగా ఆ నల్ల రాతిని ముద్దు పెట్టుకొనే వారు. మహమ్మద్ గారు ఈ ఆచారమును పాటించెను కనుక ఉమర్ కూడా అయిష్టంగానే పాటించడం జరిగింది.

ముస్లీములు శుక్రవారము ఆరాధించుట మరియు ఇస్లాం యొక్క నాలుగు పవిత్ర మాసములు కూడా ఇస్లాం కంటే ముందే ఆచరణలో ఉండేవి.

నాలుగు పవిత్ర మాసములు:

ఖుర్ఆన్ సురా 9 : 5 “ఇక నిషిద్దమాసాలు గడచిపోయిన తరువాత బహుదైవాధకులను, ఎక్కడ దొరికితే అక్కడ వధించించండి. మరియు వారిని పట్టుకోండి. మరియు చుట్టుముట్టండి, మరియు ప్రతిమాటు వద్ద వారికై పొంచి ఉండండి, మరుయు వారు పశ్చాతాప పడి వారు నమాజ్ ను స్థాపించి, జఖాత్ ఇస్తే వారిని వారి మార్గాన వదిలిపెట్టండి. నిశ్చయంగా అల్లాహ్ కరుణాశీలుడు, అపార కరుణాప్రధాత. ”

సురా 9 : 36 – 37 “నిశ్చయంగా అల్లాహ్ దగ్గర నెలల సంఖ్యా అల్లహ్ దగ్గర పన్నెండు నెలలు మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృస్టించిన దినం నుండి అల్లాహ్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాటిలో నాలుగు నిషిద్దమాసాలు) ఇదేసరైన ధర్మం, కావున వాటిలో( ఆ నాలుగు హిజ్రా మాసాలలో) మీకు మీరు అన్యాయం చేసుకోకండి. బహుదైవారధకులతో(ముష్రికీన్ లతో) అందరూ కలిసి పోరాడాండి, ఏవిధంగా అయితే వారందరు కలిసి మీతో పోరాడుతున్నారో, మరియు అల్లాహ్ దైవభీతి గలవారితోనే ఉంటాడని తెలుసుకోండి ------ ------ ---- ----- ”

అబ్దల్లః అబ్ద్ అల్ ఫది అనే ఒక చరిత్ర కారుడు ఈ విధముగా ఈ సూరాల విషయమై వ్రాసెను: బిలుఘ్ అల్ అరబ్ ఫై ఆహ్వాల్ అల్ అరబ్ అనే గ్రంథములో నమోదైన విషయము; ‘రజబ్’, ‘దు అల్ కదా’, ‘దు అల్ హిజ్జా’ మరియు ‘మొహర్రం’ అనే నాలుగు మాసములు ఇస్లాం కు ముందు ఉన్న సమయములో పవిత్ర మాసములుగా పరిగణించబడేవి. దొమ్మీలు, ప్రతీకార చర్యలు, యుద్ధము, కొట్లాటలు, మొదలగునవి ఈ మాసములలో నిషిద్ధములు. ఎవరైనా తన తండ్రిని లేక సోదరుని చంపిన వ్యక్తిని ఈ మాసములలో కలిస్తే అతనితో గొడవ పడరాదు. ఇస్లాం మతము ఈ ఆచారములనే ప్రసిద్ధి చేసింది కానీ క్రొత్తగా ఏమి ప్రపంచమునకు ఇవ్వలేదు ( అబ్ద్ అల్లాహ్ అబ్ద్ అల్ ఫది, Is the Qur’an Infallible? [Light of Life, PO Box 13, A-9503 VILLACH, AUSTRIA],

కొద్దో గొప్పో హింసను ప్రోత్సహించకుండా ఉండే ఈ సంప్రదాయాన్ని సైతం మహమ్మద్ గారు కొట్టిపారవేసి ముస్లిములకు ఈ మాసములలో అవిశ్వాసుల పై యుద్ధము చేసే అనుమతి ఇచ్చినట్టుగా ఖుర్ఆన్ గ్రంథములో చూడగలము.

సురా 2 : 194 నిషిద్దమాసానికి బదులు నిషిద్దమాసమే మరియు నిషిద్ద స్థలాలలో న్యాయ ప్రతీకారం (ఖీఫాస్) తీసుకోవచ్చు. కాబట్టి మీపై ఎవరైనా దాడిచేస్తే మీరు కూడా వారిపై అదేవిధంగా దాడి చేయండి. మరుయు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు అల్లాహ్ భయభక్తు గలవారికి తోడుగా ఉంటాడని తెలుసుకోండి.

సురా 2 : 216 మీకు అసహ్యకరమైనా! (ధర్మ) యుధ్ధము చేయడం మీకు విధిగా నిర్ణయించడమైంది. మరియు మీకుక్ నచ్చని విషయమే మీకు మేలైనది కావచ్చు. మరియు మీకు నచ్చే విషయమే మీకు మేలైనది కావచ్చు. మరియు అల్లహ్ కు అంతా తెలుసు మీకు ఏమి తెలియదు.

శుక్రవారము సామూహిక ఆరాధన :

సురా 62:9 -11 ఓ విశ్వాసులారా శుక్రవారం (జుము’ అహ్) రోజు న’మాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలు వదిలి అల్లాహ్ వైపుకు పరిగెత్తండి, మీరు తెలుసుకో గలిగితే ఇది మీకు ఎంతో ఉత్తమమైనది. ఇక న’మాజ్ పూర్తి అయిన తర్వాత భూమిలో వ్యాపించండి మరియు అల్లాహ్ అనుగ్రహన్ని అన్వేషించండి మరియు మీరు సాఫల్యం పొందాలంటే అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి. మరియు (ఓ ము’హమ్మద్) వారు వ్యాపారాన్ని కానీ, వినోద క్రీడను కానీ చూసినప్పుడు నిన్ను నిలబడి ఉన్న స్థితిలోనే వదిలిపెట్టి దాని చుట్టూ గుమిగూడుతారు. వినోదక్రీడల కంటే మరియు వ్యాపారం కంటే అల్లాహ్ వద్ద ఉన్నదే ఎంతో ఉత్తమమైనది. మరియు అల్లహ్ యే జీవనోపాధి ప్రసాధించటంలో అత్యుత్తముడు.

ముస్లీం పండితుడైన అల్ బైదావి ప్రకారము: దానిని సామూహిక దినముగా పిలుచుటకు కారణం ఆ దినమున ప్రజలు ప్రార్థనలకు జమకూడేవారు . అరబ్బులు దీనిని అల్ అరూబా అని పిలిచెవారు. కొద్ది మంది దానికి ఆ పేరు కాబ్ ఇబ్న్ లుబాయి అనే వ్యక్తి ఇచ్చాడని చెబుతారు ఎందుకనగా ప్రజలు ఆయన చుట్టూ ఆ దినమున గుమిగూడేవారు. మహమ్మద్ గారు కాబాలో ఒక వారము గడిపిన తరువాత మొట్ట మొదటి సారిగా ప్రజలను ఆ దినమున ( శుక్రవారము) మదీనా లో ప్రార్థనలకు జమకూర్చారు. (అల్ ఫదిIs the Qur’an Infallible?, p.126)

అదే విధముగా రచయిత అయిన బులుఘ్ అల్ అరబ్ ఫై ఆహ్వాల్ అల్ అరబ్ కూడా అదే సమాచారం ఇచ్చాడు అంతే కాక ఆయన ప్రకారం ఆ దినమున (శుక్రవారం) కాబ్ ఇబ్న్ లుబాయి ప్రచారము / వర్తమానము అందించేవాడు అని కూడా వ్రాసాడు. ( వాల్యూం 1 పేజీ 126 )

అంతే కాక ముస్లిముల ప్రార్థనలు సైతం అరబ్ ల ఆచారముల నుండి గ్రహించబడినవేనని బులుఘ్ అల్ అరబ్ ఫై ఆహ్వాల్ అల్ అరబ్ విశదీకరించెను.

సబీయులు దినముకు 5 ప్రార్థనలు చేసెడివారు. ముస్లీములు వారివలె ఉదయము, మధ్యాహ్నముకు ముందు, మధ్యాహ్నము తరువాత, సాయంత్రము మరియు రాత్రి ప్రార్థనలు జరపటం ఆరంభించారు. అంతే కాక సాబీయులు ఒక చంద్రమాసము ఉపవాసము కూడా ఆచరించేవారు. ఆ ఆచారములనే మహమ్మద్ గారు ఇస్లాంలో జత పరిచినట్టు సులువుగా అర్థం చేసుకో వచ్చు.

పై సూత్రముల ఆధారంగా మహమ్మద్ గారు ఇస్లాం మతములో విగ్రహారాధన మరియు అన్యుల ఆచారములకు ఎక్కువగా చోటుఇచ్చారు అని అర్థం చేసుకునేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. కాక పోతే అన్ని అల్లాహ్ చే ఆజ్ఞాపించబడిన ఆచారములుగా ప్రచులితం చేయడం జరిగింది.

క్రైస్తవ్యంలో కూడా విగ్రహారాధన కనిపించినప్పటికీ అవి క్రైస్తవులుగా మారిన అన్యులు ఆచరించిన ఆచారములు మాత్రమేగాని బైబిలులో ఎక్కడా ఆజ్ఞాపించబడినవి కావు.

category: