యేసు పరీక్ష

యూసుఫ్ ఎస్టేస్ అనే ఒక ఇస్లాం మత ప్రచారకుడు తన వెబ్సైటు లో “యేసు పరీక్ష” (జీసస్ టెస్ట్) అనే శీర్షిక ను వ్రాసాడు.
ఆ శీర్షిక కు ఎంతో మంది ముస్లిముల ప్రతిస్పందన కూడా లభించింది. కాక పోతే ఆయన ఇచ్చిన ఆ పరీక్ష లో ఉన్న తార్కిక లోపాలు మరియు సందర్భాను సారము కాని ఉల్లేఖనములను మీ ముందు ఉంచాలన్నది ఈ వ్యాసము యొక్క మూల ఉద్దేశ్యము. యూసుఫ్ తన శీర్షిక లో బైబిల్ నుండి కొన్ని వాక్యములను సందర్భము లేకుండా ప్రచురించి ఇస్లాం మత ప్రచారమునకు అనుగుణంగా జవాబులు వచ్చే ప్రశ్నలను అడిగి ఏదో వేలుగాబెత్తానని భావించినట్టు కనిపిస్తోంది. ఆ శీర్షికను http://islamnewsroom.com/news-we-need/1349-who-really-follows-jesus లో చూడ వచ్చు.యూసుఫ్ ఎస్టేస్ అన బడే ఈ ఇస్లాం మత ప్రచారకుడు అమెరికా దేశములో ఒక క్రైస్తవుని గా జన్మించాడు. తన జీవన ప్రయాణం లో ఒక ముస్లిం తో తటస్థపడి ఇస్లాం మతమునకు ఆకర్షిమ్పబడి ముస్లిం గా మారాడు. తను ఇస్లాం మతాన్ని స్వీకరించే కథను తన వెబ్సైటు లో ఆయనే వివరించడం మనం గమనించ వచ్చు. తన ఈ ప్రశ్నోత్తరాల పరీక్షో లో అమర్చిన ప్రశ్నలను ఒకటి తరువాత ఒకటి మనం ఈ కొద్ది వ్యాసం లో చూద్దాం.
ప్రశ్నలకు ముందు యూసుఫ్ ఎస్టేస్ గారు “గతించి పోయిన మరియు ఆఖరి నిబంధనల నుండి ప్రవక్తల సందేశము” అని చెప్పడం గమనార్హం. ఇక్కడ గతించి పోయిన లేక కోల్పోయిన నిబంధన అనే పదానికి ఇంగ్లీష్ లో “లాస్ట్” (LOST ) అనే పదం వాడ బడటం జరిగింది. అంటే బైబిల్ ను కోల్పోయిన నిబంధన గా యూసుఫ్ ఎస్టేస్ గారు వర్ణించారు. అలాగే కురాన్ ను ఆఖరి నిబంధనగా (LAST ) వర్ణించారు. వాడుకకు లేక ప్రాసలో ఉండటానికి ఆ రెండు పదములను వాడారో లేక నిజంగానే ఆయన బైబిల్ గ్రంధం ను కోల్పోబడిన గ్రంధం అని నమ్ముతున్నారో ఆయననే అడిగి చూడాలి. ఒకవేళ ఆయన నిజంగా బైబిల్ గ్రంధం కోల్పోబడిన గ్రంధం అని అనుకుంటే అదే కోల్పో బడిన గ్రంధం నుండి వాక్య భాగాలను ఎంచుకుని తన దృక్పదాన్ని ద్రువీకరించుకోవాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అంటే బైబిల్ కోల్పోబడిన గ్రంధం అయితే బైబిల్ లో నుండి తీసిన వాక్యములు ఆయనకు ఎలా వచ్చాయి? ఒక వేళ ఆయన అంతా కోల్పోలేదు కొంతే కోల్పోయింది అని అంటే, యే భాగం, ఎక్కడ ఎవరిచేత కోల్పో బడిందో చెప్పాలి. ఈ ప్రశ్నలన్నీ గత 16 శతాబ్దాలుగా క్రైస్తవులు ముస్లిములను అడిగుతూనే ఉన్నా కాని జవాబు లేదు కాని ఏదో ఉద్ధరించామంటూ బైబిల్ లోని కొన్ని వాక్య భాగాలను బట్టీ పట్టి ప్రజలను తప్పు దోవ పట్టించటం ఈ ముస్లిం ప్రచారకులకు బాగా అలవాటే. ఒకవేళ యూసుఫ్ ఎస్టేస్ బైబిల్ కోల్పోబడింది అని అంటే ఇస్లాం ప్రవక్త అయిన మొహమ్మద్ మరియు ఆయనకు దేవుని నుండి వెలు వడినది అని చెప్పుకొనే కురాన్ గ్రంధం రెండూ తప్పే. ఎందుకంటే కురాన్ లోని సుర అల్ ఇమ్రాన్ 3 :3 మరియు సుర 46 : 30 లలో “బైన యదేయ్హి” అనే పదానికి సరైన తర్జుమా వారి చేతుల నడుమ అని అర్థం. అనగా మొహమ్మద్ సమయం లో వాడబడిన బైబిల్ ప్రతులు అని అర్థం. అంటే మొహమ్మద్ తన సమయం లో ఉన్న బైబిల్ గ్రంధాన్ని దేవుని నుండి వెలువడిన గ్రంధం గా గుర్తించారు అని అర్థం. కాని యూసుఫ్ ఎస్టేస్ లాంటి ప్రచారకులకు మాత్రం ఆ గ్రంధం కోల్పోబడినది అన్న మాట. ఆమాటకు వస్తే కురాన్ రూప కల్పనను గురించిన చరిత్ర తెలిసిన ఎవ్వరు కూడా దానిని బైబిల్ లాంటి మహా గ్రంధం తో పోల్చరు. ముస్లిములైన, మొహమ్మద్ చే మంచి అనుచరులుగా గుర్తించబడిన వారు వ్రాసిన చరిత్ర లో చాలా భాగం కురాన్ నశించి పోయిందని నొక్కి వోక్కానిన్చినట్టుగా వ్రాసి ఉంది. దీనికి సంబంధించిన సమాచారం కురాన్ ప్రామాణిక గ్రంధమేనా అనే నా రచన లో చదువగలరు.
ఇక అసలు కథ అయిన ఆయన ప్రశ్నల వద్దకు వద్దాం.మొదటి ఆరు ప్రశ్న లు ఒకే కోవకు చెందినవి కనుక వాటిని అన్నిటిని ఒకే సారి గమినించి చూద్దాం.
1 యేసు, నిత్యజీవమును పొందుట కొరకు దేవుని ఆజ్ఞలను పాటించాలి అని బోధించెనా లేదా?
2 .యేసు దేవుని మాత్రమే ఆరాధించమని చెప్పలేదా?
3 . యేసు మనకు దేవుని ఆజ్ఞలను అన్నిటిని ఆచరించమని చెప్పలేదా?
4 . విగ్రహారాధన చేయరాదు అని చెప్పలేదా?
5. యేసు ఆయనను ఆరాధించకూడదు అని చెప్పలేదా?
6 . యేసు నేను దేవుడిని కాదు అని బహిరంగంగా చెప్పలేదా?
లూకా 10 : 25 – 28 ‘ఇదిగో ఒకప్పుడు ధర్మ శాస్త్రోపదేశకుడు ఒకడు లేచి – బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోదించుచు అడిగెను. అందుకాయన – ధర్మ శాస్త్రమందేమి వ్రాయ బడి యున్నది? నీవేమి చదువుచున్నావని అతని అడుగగా, అతడు నీ దేవుడైన ప్రభువును, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సు తోను, నీ పూర్ణ శక్తి తోను, నీ పూర్ణ వివేకము తోను ప్రేమింప వలెననియు, నిన్ను వలే నీ పొరుగు వాని ప్రేమింప వలెననియు, వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని చెప్పెను’. ఈ వచనము ఆధారముగా కేవలము దేవుడైన యెహోవా (వేరెవరు కాక) ను మాత్రమే ఆరాధించ వలెను అని చెబుతూ కురాన్ లోని సుర 51 : 56, సుర 4 : 48 సుర 112 లను చూపించటం జరిగింది . నిజానికి ఇక్కడ ఆరాధన గురించి చెప్పటం లేదు కాని ప్రేమ గురించి చెప్పడం జరిగింది. మన విషయానికి వస్తే ఆజ్ఞలను పాటించమని యేసు బోధించాడు అలాగే కురాన్ కూడా అల్లాః ను మాత్రమే ఆరాధించు అని చెబుతోంది అన్న వాదనను ఇక్కడ యూసుఫ్ వినిపిస్తున్నట్టుగా ఉంది. కానీ జాగ్రత్తగా చూస్తే మనకు తెలిసివచ్చేది ఏమిటంటే బైబిల్ లో చాలా మార్లు యేసును మనుశ్యులు ఆరాధించినప్పుడు ఆయన ఒక బోధకుడు అయ్యి ఉండి వారిని వద్దు అని చెప్పక వారి ఆరాధనలను స్వీకరించి నట్టుగా మనం చూడ వచ్చు. ఉదాహరణకు తోమా “నా దేవా నా ప్రభువా” అని ఆయనను సంబోధించి నప్పుడు ఆయన తోమాను వారించ లేదు ( యోహాను 20 :28 ). యేసు తన ముందే ఆయన శిష్యుడు ఆయనను భక్తి తో దేవా అని సంబోదిన్చినప్పుడు వారించక ఆయన సాక్ష్యమును స్వీకరించినట్టుగా బైబిల్ లో చూస్తున్నాం. అలాగే బైబిల్ గ్రంధం మనుష్యులు దేవుని సంపూర్ణ మనస్సుతో ప్రేమించలేని అవస్తలో ఉన్నారు కనుక ( పాపము కారణంగా) దేవుడే ముందు మనలను ప్రేమించి మనకు ధర్మశాస్త్రము ద్వారా కాక పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పట్ల ప్రేమను పురి కొల్పాడు అని చెబుతోంది. కనుక కేవలం ధర్మ శాస్త్రమును అనుసరించ మని మాత్రమే యేసు బోధించలేదు కాని ధర్మ శాస్త్రమును ఆయన సంపూర్ణముగా నెరవేర్చి ఆయన యందు విస్వాసముంచుట ద్వారా మనలను రక్షించాడు. రోమా 3 : 28 “కాగా ధర్మ శాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విస్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు….” కనుక ఇప్పుడు క్రీస్తును విశ్వసించి ఆయన రక్షకుడైన దేవుని కుమారుడు అని విశ్వసిస్తే మాత్రమే మనము పరలోకమునకు అర్హులము అవుతాము అని అర్థం. ( రోమా 10 :9).
యూసుఫ్ ఎస్టేస్ గారు తన అయిదవ ప్రశ్న లో యేసు తన చుట్టూ ఉన్నవారితో ఆయనను ఆరాధించ వద్దు అని చెప్పినట్టు వ్రాయటం గమనించండి. ఇక్కడే ఆయన గారు ఘోరంగా పప్పులో కాలేసారు. ఈ ప్రశ్నకు ఆయన జత పరిచిన వాక్య భాగమును (మత్తయి 15 :9 ) చూస్తే ఆయన బైబిల్ ను ఎంత అనాలోచితంగా, సందర్భము లేకుండా చదువుతారో అర్థం అవుతుంది. ఈ వాక్య భాగం లో యేసు శాస్త్రులను పరిసయ్యులను తమ పారంపరాచార్యము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నారని వారిని దండించే సమయం లో యెషయా ప్రవక్త చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తున్నారు అని గ్రహించాలి. అంతే కాని అక్కడ యేసు నన్ను ఆరాధించ వద్దు అని యే కోశానా చెప్పలేదు. యేసు పునరుత్తానుడైన పిదప తన శిష్యులు గలిలియ కొండ దగ్గర ఆయనను మ్రొక్కిరి అని మత్తయి 28 :17 లో వ్యాయబడి ఉండటం యూసుఫ్ గారికి బహుశా తెలియదు కాబోలు. ఇదే మత్తయి లో యేసు యుగ సమాప్తి వరకు శిష్యులతో కూడా ఉంటాను అని చెప్పటం గమనిస్తే ఆయన కేవలం ఒక ప్రవక్తో లేక సాధారణ మానవుడో కాక దైవాంశ సంభూతుడని యిట్టె తెలిసి పోతుంది.
ఇక ఆరవ ప్రశ్న, యేసు తన దైవత్వమును బహిరంగంగా విస్మరించాడు అని చెప్పేందుకు, యూసుఫ్ వాడిన వాక్య భాగం యోహాను 14 :28 ఈ వాక్యభాగము ముస్లిములకు చాలా ఇష్టమైనది కాబోలు. ప్రతివాడు ఈ వాక్య భాగాన్ని పట్టుకొని వ్రేలాడుతూ ఉంటాడు. ఈ వాక్యం వల్లించి ఏదో సాధించాం అనుకుంటారు. లోతుగా దీనిని చదివిచూస్తే ఆ గాలి కాస్తా తుస్సు మని పోతుంది. ఇక్కడ “తండ్రి నాకంటే గొప్ప వాడు” అనే వాక్యం లో గొప్ప వాడు అన్న మాటకు గ్రీకు లో “మేఇజోన్” అనే పదం వాడ బడి ఉంది. దీనిని ఎక్కువగా అధికారము, స్థాయి, ప్రతిపత్తి మరియు పదవి గురించిన సందర్భములలో వాడతారు కానీ స్వభావము విషయములో వాడరు. మత్తయి 11 :11 లో యోహాను మనుష్యులందరిలో గొప్పవాడు అని చెప్పే సందర్భం లో కూడా ఇదే గ్రీకు పదమును వాడటం గమనార్హం. ఇక్కడ మిగితా మనుష్యులు యోహాను కంటే తక్కువ మనుష్యత్వం కలవారు అని అర్థం కాదు కానీ సాధారణ మనుష్యుల కంటే యోహాను గొప్ప స్థాయి లేక పదవిలో ఉన్నట్టు తెలియ జేయడం యేసు యొక్క ఉద్దేశ్యం. అలాగే నాకంటే తండ్రి గొప్ప వాడు అన్న దానికి అర్థం ఎసుకంటే తండ్రి మెరుగైన దేవుడు అని కాదు కానీ ఆయన స్థాయి పెద్దది అని అర్థం చేసుకోవాలి. యూసుఫ్ గారు మనకు ఏదో సాధించాను అని చూపించే వాక్య భాగాన్ని దాని సందర్భం లో మొత్తాన్ని చదివి చూద్దాం. ముఖ్యంగా 14 :20 -21 ని గమనిస్తే ఆయన శిష్యులందరిలో ఉంటాను అని చెప్పి దైవగుణమైన సర్వమునందు వ్యాపించగల శక్తి తనకుంది అని చెప్పడం యూసుఫ్ గారికి అర్థం అవ్వలేదేమో? అలాగే 23 వ వచనములో “మేము” (తండ్రి మరియు యేసు) తమను ప్రేమించిన వారి యందు నివాసం చేతుము అని చెప్పడం అయన తనను తండ్రికి సమానముగా ఎంచుకొనటం కాదా? 13 – 14 వచనాలలో యేసు ఆయన నామమున మనము ఏది అడిగిన “ఆయనే” చేతును అని చెప్పడం మరువరాదు. ఇలా ఎన్నో వచనములు యేసు తండ్రితో ఏకమై ఉన్నట్టు సమాత్వమును చాటటం మనం చదువగలం (యోహాను 10 :29 ).

ఇలా ముఖ్యమైన విషయాలతో కలిసి కొన్ని అనవసరమైన ప్రశ్నలు కూడా యూసుఫ్ గారు తన శీర్షికలో అడిగారు. అలా అనవసరమైన ప్రశ్నలను మినహాయించి ముఖ్య మైన ప్రశ్న 13 ను చూద్దాం. “యేసు తన లాంటి ఇంకొ ప్రవక్త వస్తాడు అని ప్రవచనం చెప్పాడా లేదా?” దీనికి జవాబుగా యేసు చెప్పిన ఆ ప్రవక్త ఇంకెవరో కాదు మొహమ్మదే అని యూసుఫ్ ఎస్తేస్ గారి వాదన. ఈ వాదనకు సరిపోయేదిగా యోహాను 16 : 7 -8 వచనాలు ఆయన తన శీర్షికలో జత పరచడం జరిగింది. అలాగే కురన్ లోని సుర 61 : 6 కూడా జోడించడం జరిగింది.
ఈ వాదనను కొంచం లోతుగా పరిశీలించి చూద్దాం.
యోహాను 16 లో ఇలా వ్రాయబడి ఉంది ” అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లి పోవుట వలన మీకు ప్రయోజన కరము; నేను వెళ్ళని యెడల ఆదరణ కర్త మీ యొద్దకు రాడు; నేను వెళ్ళిన యెడల ఆయన ను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.”
కురాన్ 61 : 7 లో ” మరియమ్మ కుమారుడు యేసు తమ జాతితో ఇట్లనినది జ్ఞాపకము చేసికోనుడు “ఓ ఇస్రాయిల్ సంతతి ప్రజలారా ! నేను అల్లాః వైపునుండి మీయోద్దకు ప్రవక్త గా వచ్చితిని నా రాకకు పూర్వము అవతరింపబడిన (సందేశమైన) ‘తౌరాత్’ ను దాని భవిష్యత్ వానులను నేను పూర్తి చేయుదును. నా తరువాత వచ్చు ఒక ప్రవక్త వార్త కూడా అందింతును. అతని పేరు అహ్మద్. ఆ ప్రవక్త స్పష్ట సాక్ష్యాధారాలతో వచ్చినప్పుడు వారు “ఇది స్పష్టమైన మోసము అనిరి”.
ఈ రెండు వచనములను ఆధారం చేసుకొని యూసుఫ్ ఎస్తేస్ గారు తన వాదన ను నిరూపించ ప్రయత్నం చేసారు. ఆయన ప్రకారం యోహాను సువార్త లో యేసు చెప్పిన ప్రవక్త మొహమ్మదే మరియు దానికి సాక్ష్యంగా మొహమ్మద్ చెప్పిన కురాన్ ను యూసుఫ్ మనకు చూపిస్తున్నారు. దీనిని విశ్లేషిస్తూ కొంచం ధ్యానిద్దాం. మొదట యేసు మాటలను ఆ వాక్యము యొక్క సందర్భము మరియు యోహాను సువార్త మొత్తం యే సందర్భం లో వ్రాయ బడి ఉందొ చదివి చూద్దాం. దీనికి ముందు యూసుఫ్ వేసిన ప్రశ్న ఇంకోసారి చదివి చూద్దాం.

యేసు తన వంటి లేక తనను పోలిన ప్రవక్త ఇంకొకడు వస్తాడు అని చెప్పినట్టు యూసుఫ్ అంటున్నారు. కానీ యోహాను లో యేసు తన వంటి ప్రవక్త వస్తాడు అని చెప్పలేదు. ఆదరణ కర్త యేసు వెళ్ళిన తరువాత ఆయన చే పంపబడును అని యోహాను లో వ్రాయబడి ఉంది. ఆ ఆదరణ కర్త తనను పోలిన ప్రవక్త అని యేసు చెప్పలేదు.
ఇక పోతే ఇదే యోహాను 16 లో ఇంకొంచం ముందుకు చదివితే 13 వ వచనం లో ఈ ఆదరణ కర్తను సత్య స్వరూపి అయిన ఆత్మ గా వివరించడం జరిగింది. మొహమ్మద్ ఆత్మ అని బహుశా యూసుఫ్ ఎస్తేస్ గారు ఒప్పుకోరేమో!
అలాగే యేసు ఆదరణ కర్త అయిన ఆత్మ తన వాటిలోనివి తీసికొని మాత్రమే ప్రజలకు తెలియ జేయును అని చెప్పారు,మరి మొహమ్మద్ అలా చేసారో లేదో యూసుఫ్ గారికే తెలియాలి!
ఇదే కోవలో, పంపబడిన ఆదరణ కర్త యేసును మహిమ పరచును అని వ్రాయబడి ఉంది. కానీ మొహమ్మద్ యేసును మహిమ పరచాడో లేదో కురాన్ చదివిన వారికి స్పష్టంగా అర్థం అవుతుంది!

ఇలా చూసుకుంటూ పోతే మొహమ్మద్ యేసు చెప్పిన ఆదరణ కర్త కు పోలిన యే ఒక్క గుణమును తన జీవితములో కనబరచక పోగా అంత్య క్రీస్తును పోలిన గుణములను చక్కగా తనలో ఇముడ్చుకున్నట్టు మనం చూడగలం. యేసు మరణ పునరుత్తానముల అనంతరం బయలు వెళ్ళిన ప్రవక్తలు యేసు నామము లో బయలు దేరారు. మొహమ్మద్ యేసు నామము లో రాలేదు. ఉదాహరణకు మత్తయి 23 :34 ప్రకారము యేసు ” నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను” అని చెప్పడం జరిగింది. అనగా యేసు తన ప్రవక్తలను తన నామము లో పంపుచున్నారు అని అర్థం.

ఈ వాక్య భాగాన్ని యోహాను యొక్క మొత్తం సువార్త సందర్భం లో చదివిచూస్తే యోహాను మనకు యేసును దేవుని గా మనకు పరిచయం చేస్తున్నాడు అని అర్థం అవుతుంది. మొదటి అధ్యాయం లో ఆదియందు దేవునితో, దేవుని యందు మరియు దేవుడై ఉన్న వాక్యమే శరీర ధారిఅయి అద్వీతీయ కుమారుడైన యేసు మనముందు జ్యోతిర్మయుడై మన పాపములకొరకు బలియయిన దేవుని గొర్రెపిల్ల వలె ఇలలోకి విచ్చేసిన సంగతి అలాగే మనము దేవుని పిల్లలముగా అధికారము పొందుటకు ఆయన తన ప్రాణము సైతము స్వ్వచ్చందముగా అర్పించటం తిరిగి పెట్టిన ప్రాణాన్ని మూడవ రోజు తిరిగి తీసుకొని మరణమును జయించి మృత్యుంజయుడై అమరమైన జీవితాన్ని ఉచితంగా తన పై విశ్వసించిన వారికి ఇస్తానని ప్రమాణం చేసినట్టుగా ఈ పుస్తకం లో పూసగుచ్చినట్టు వ్రాయ బడి ఉంది. మరి యూసుఫ్ ఎస్తేస్ గారు ఎంచుకొనిన 16 వ అధ్యాయమును యోహాను సువార్త యొక్క నేపద్యంలో చదివిచూస్తే యేసు ప్రవక్తలను సైతం తన నామమున పంపిచ గల మహా దేవుడై ఉండాలి. కానీ ఎప్పటిలాగే ముస్లిం పండితులు వారికి అవసరమయ్యే వచనములు మాత్రమే తమదయిన శైలిలో వక్రీకరించి తమకు కావలసిన అర్థాన్ని మాత్రమే తీసుకుంటారు అని లోకమునకు విధితమే కనుక యూసుఫ్ ఎస్తేస్ గారు చేసిన ఈ తుచ్చ ప్రయత్నం క్రైస్తవ లోకాన్ని కలవరపెట్టేంత పెద్దదేమీ కాదు. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది: యేసు ను దేవుడా కాడా అని పరీక్షించిన విదానములోనే మొహమ్మద్ ను ప్రవక్తా కాదా అని పరీక్షించి చూద్దాం.

మొహమ్మద్ సాతాను మాటలను పలికి అవి అల్లాః మాటలే అని పలుక లేదా? కురాన్ 53 :19 ,20
మొహమ్మద్ పలికిన కొన్ని ప్రవచనములు / భావిష్యవానులు సయితం తప్పు కాలేదా? కురాన్ 30 :2 -4 , 48 :27
మొహమ్మద్ తను దయ్యము పట్టిన వాడు అనుకొని ఉండటం అబద్దమా? సాహి అల్ బుఖారి 9 :111
మొహమ్మద్ ఆత్మ హత్యా ప్రయత్నం చేయటం అబద్దమా ? సాహి అల్ బుఖారి 9 :111
మొహమ్మద్ తనకు అల్లాః నియమించిన భార్యల సంఖ్య కంటే ఎక్కువ మందిని పెండ్లి చేసుకోలేదా? కురాన్ 4 :3 – సాహి బుఖారి వాల్యూం 7 బుక్ 62 సంఖ్య 142
మొహమ్మద్ లూటీ చేసిన సొమ్ము తో తన సామ్రాజ్యాన్నికట్టలేదా? బుఖారి వాల్యూం 7 బుక్ 67 సంఖ్య 402

పైచెప్పినవన్ని జరిగి ఉంటె ఆ వ్యక్తి ప్రవక్త కాదు అని చెప్పటానికి ఏదో పెద్ద చదువులూ లేక ధార్మికమైన అధ్యయనం చేసి ఉండవలసిన అవసరం లేదు, సామాన్య తర్కం తెలిసిన యే సామాన్య మానవుడైన ఇలాంటి పనులు చేసిన వారిని ప్రవక్తగా లేక మహా పురుషునిగా అంగీకరించరు. ఇలాంటి అఘాతుకాలకు పాల్పడి తన అనుచరులను సైతం అఘాతుకాలకు పాల్పడమని నేర్పించే మొహమ్మద్ మరియు అతను ప్రతిపాదించిన మతం ఇస్లాం గురించి సరిగ్గా తెలిసిన ఎవ్వరు మహా ఘనుడు, మహోన్నతుడు, జ్యోతిర్మయుడు, పాపులకోరకు ప్రాణాలర్పించిన మహా దేవుడు యేసు ను విడిచి ఇస్లాం మతమునకు పోరు.

category: