ఏది దేవుని వాక్యం బైబిలా ఖురనా

ముందు మాట.

త్రిత్వ సిద్ధాంతమును గ్రహించటానికి స్పష్టతతో కూడిన లోతైన పఠనము

అభినందన
త్రిత్వము క్రైస్తవ మూల సిద్ధాంతము. త్రిత్వము క్రైస్తవ్యానికి ఆయువు పట్టు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో ఎవరు దేవుడు కాకపోయినను బైబిల్ అర్థరహితమౌతుంది, మనము విశ్వాస భ్రష్టులమౌతాము. దేవుడు ఒక్కడే. తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ఉన్నాడు. ఐతే తండ్రి కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు. అలాగే కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, తండ్రి కాదు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి కాడు, కుమారుడు కాడు. ఐనప్పటికీ ముగ్గురు దేవుళ్ళు లేరు. వీరు ఏక కాలములో ఉన్నారు, ఒకే సారాన్ని కలిగి ఉన్నారు, సమానముగా ఉన్నారు (Co-Exixting, Co-Essential and Co – Equal).

ఏది దేవుని వాక్యం – బైబిలా ఖురానా?

ఒట్టేసి చెప్పవా!!

ఒట్టేసి చెప్పవా!!

బైబిలు గ్రంథం ఒట్టు పెట్టుకోవడం గురించి చాలా స్పష్ట మైన వైఖరిని అవలంభిస్తుంది.

ఒట్టు వేయటానికి అవసరత అసలు ఒక విశ్వాసికి రాకూడదు అని యేసు క్రీస్తు వారు చెప్పారు. ఒక విశ్వాసి అవును అంటే “అవును” కాదు అంటే “కాదు” అయి ఉండాలి అనేది యేసుక్రీస్తువారి నైతిక స్థాయి (మత్తయి 5 :37 ).పాత నిబంధన గ్రంథములోని సూత్రము ప్రకారము ఒకవేళ ప్రమాణము చేయవలసి వస్తే లేక ఒట్టు పెట్టుకోవలసి వస్తే నమ్మదగిన దేవునితోడు అని యెహోవపై మాత్రమే ఒట్టు పెట్టుకోవాలి ( యెషయ 65:16) అని అర్థం అవుతుంది.

తకియ్య

1400 ఏళ్ళ పైచిలుకు వయసు గల ఇస్లాం మతము ఆ మతమును అనుసరించే వారికి ఇచ్చిన సదుపాయాలలో మత పరముగా పనికొచ్చే సదుపాయం తకియ్య!
ఈ సిద్ధాంతము ప్రకారం మిస్లుములు క్లిష్ట పరిస్థితులలో ఉన్నపుడు వారి మతమును, బయటకు విస్మరించి మనసులో వారి విశ్వాసమును నిలుపుకోవచ్చు. ఇది కేవలము మతమును దాచిపెట్టేందుకు మాత్రమే కాక జీవితములోని అన్ని కోణాలలో కూడా దీనిని ఉపయోగించ వచ్చు అని ఇస్లాం పండితులు చెబుతున్నారు. ఈ ఆచారము ప్రకారము మోసపూరిత అబద్ధములు ఆడటానికి కూడా అనుమతి ఉంటుంది. ఇస్లాం మతము లో సత్యమును దాచి పెట్టటం మరియు అబద్ధములాడటం అనుమతిన్చనట్టుగా ఉంటుంది సురా 2:42

జాకీర్ నాయిక్ – ఇస్లాం శాంతియుతమైన మతమా?

జాకిర్ నాయక్ అనే ఒక ఇస్లాం ప్రచారకుడు తన గొప్ప మాటకారితనంతో ఇస్లాం మాత్రమే గోప్ప మతమని ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆయన PTV అనే ఛానల్ ద్వారా తన తర్కములను ప్రజల వద్దకు చేరవేయడం మనకు తెలిసిందే. కాకపోతే మాటలతో మభ్యపెట్టే ఆ ప్రచారకుని మాటలలో ఎంత నిజం ఉంది అని తెలుసుకొనే ప్రయత్నం చేసే సమయం, అభిరుచి ఆదరిలోనూ ఉండదు. ఆయన తన మతమును ప్రచారం చేయడములో ఎవ్వరికీ సమస్య ఉండదు కానీ ఆ ప్రక్రియ లో క్రైస్తవ మతమును కించ పరిస్తే లేక క్రైస్తవ విశ్వాసము పట్ల ప్రశ్నలను లేవనెత్తితే అదే రక మైన కొలత ఆయన కు కూడా వర్తిస్తుంది.

ఇస్లాం లో రక్షణ / నిజాత్

ఈ మధ్య కాలం లో కొన్ని ఇస్లామిక్ సాహిత్యాలను పరిశీలించే సమయం లో మౌలానా మహబూబ్ ఇలాహి గారు ప్రసంగించిన ఒక ప్రసంగం వినటం జరిగింది. ఆ ప్రసంగం యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే పాప క్షమాపణ నిమిత్తం, రక్షణ నిశ్చయత నిమిత్తం అనగా ఉర్దూ లో నిజాత్ నిమిత్తం అల్లాః ను వేడుకోనవలెను అని.
ప్రసంగం ఎలావున్నా అసలు విషయమైన రక్షణ నిశ్చయతను జాగ్రతగా పరిశీలించాలని ఈ వ్యాసం పొందు పరచడం జరిగింది.

ఇస్లాం శాంతియుతమైన మతమేనా?

ఈ వ్యాసములో ఈనాటి ముస్లిములు చేసే హింసను ఆధారముగా చేసుకొని ఆ మతమును హింసాత్మకమైన మతం గా చిత్రించే ప్రయత్నం చేయబడలేదు. కానీ ముస్లిములు మతం పేరిట చేసే హింసకు కారణం ఏమిటి? అసలు ఇస్లాం మతం శాంతియుతమైన మతమా లేక ఆ మతం లో హింసకు ప్రోద్బలం ఇవ్వ బడిందా అని ఇస్లాం సాహిత్యాల ఆధారముగా విశ్లేషించే ప్రయత్నం చేయబడింది.

కురాన్ లోని 7 అద్భుతములు

ఈనాటి ముస్లిం పండితులలో పేరెన్నిక గలిగిన వారు మరియు ఎంతో మంది క్రైస్తవ వేద పండితులతో చర్చించిన వారు అయిన డా: జమాల్ బదావి
గారు కురాన్ దేవునిచే రచింప బడినదని నిరూపించుటకై 7 కారణములు తరచూ తమ వివరణలలో ఇస్తూ ఉంటారు. ఆ వివరణ లను పరిశీలిస్తూ అది ఎంతవరకు నిజం మరియు నమ్మదగినవో విశ్లేశించటమే ఈ వ్యాసము యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
బదావి గారు వివరించే 7 నిదర్శనములు:
1 . అంతర్ నిదర్శనం
2 . గ్రహించే వాని పారదర్శకత మరియు నిజాయితి
3 . సాహిత్య విలువలతో కూడిన సవాలు
4 . అంతర్ వైరుధ్యం లేక పోవటం
5 . ఖండితముగా చెప్పబడిన ప్రవచనాలు

కురాన్ ప్రామాణిక గ్రంథమా?

ఇస్లాం మతము లో అతిపెద్ద అబద్ద ప్రచారము ఏమిటంటే కురాన్ లేఖనములు యే మాత్రం వికృతిలేని మరియు జాగ్రతగా సంరక్షిమ్పబడినవి అన్న వదంతు. ఎన్నో శతాబ్దాలు గా బైబిలు గ్రంధము లోని లేఖనములు మానవునిచే వక్రీకరించబడ్డాయని అలా కాకుండా కురాన్ మాత్రం ఎంతో జాగ్రతగా మానవుని వక్రీకరణకు లోనుకాకుండా సంరక్షింపబడిందని ముస్లిములు చాటుతూ వచ్చారు. అయితే ఈ విషయాన్ని లోతుగా పరీక్షించి చూస్తే తేలే పరిణామాలు భిన్నంగా ఉంటాయి.

Pages