UIRC – బైబిలు లో మొహమ్మద్

భూమ్యాకాశములను సృజించి మానవులను భూమిపై అధికారముగలవారుగా చేసి వారి అతిక్రమములను పరిహరించటానికి తనకు తానే సిలువయాగం చేసి మృత్యువు ను జయించి సర్వ మానవాళి కి ఆదర్శ ప్రాయుడైన యేసు క్రీస్తువారి దివ్యమైన నామములో అందరికి శుభములు. యేసు క్రీస్తువారు భువిపై మానవునిగా సంచరించినప్పుడు అభివందనం చేసిన విదంగా అందరికి “శాలోం” అనగా సమాధానము కలుగుగాక.

UIRC అనే ముస్లిము సంస్థ కు చెందిన షఫీ గారు బైబిలు లో మొహమ్మద్ అనే వీడియో ద్వారా ఇస్లాం మత స్థాపకుడైన మొహమ్మద్ గారిని యూదుల మరియు క్రైస్తవుల చే ఎదురు చూడబడే ఒక గొప్ప ప్రవక్త గా చిత్రీకరించా టానికి వ్యర్థ ప్రయత్నం చేసినట్టు గా మనం ఇంటర్నెట్ లోనూ మరియు వారి చే పంపిణీ చేయబడే సీడీ లలోనూ చూడవచ్చు. వ్యర్థ ప్రయత్నం అని ఎందుకు అన్నానంటే ఇలాంటి ప్రయత్నం షఫీ గారికంటే ముందు చాలా మంది చేసి విసికి వేసారి నట్టు తెలుసుకోవటానికి మనకు ఎంతో సమయం పట్టదు. క్రైస్తవ సమాజం ఈ తరహా కు చెందిన ప్రశ్నలకు చాలా సునాయాసంగా గత 1300 సంవత్సరాలుగా జవాబు చెబుతూనే ఉంది. షఫీ లాంటి వారికి గురువు వంటి వారైన అహమద్ దీదాత్ గారు అడిగిన ప్రశ్నలనే షఫీ గారు మళ్ళీ మళ్ళీ అడగటం కంటే క్రైస్తవ సమాజం ముందే ఇచ్చిన సమాదానములను ఒక్క సారి తడిమి చూస్తే చాలు. అయినా సరే షఫీ గారి ఉత్సాహానికి జవాబుగా ఈ చిన్న ప్రయత్నం.
ఆయన ప్రతిపాదనలకు స్పందన ఇవ్వటానికి ముందు ఆయన ఎంచుకున్న సందేశాన్ని విశ్లేషించే వైఖరిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆయన “బైబిల్ లో మొహమ్మద్” అనే అంశాన్ని విశ్లేషించటానికి కురాన్ మరియు బైబిల్ ను విరివిగా వాడినట్టు మనం చూడగలం. అయితే కురాన్ మరియు బైబిల్ పైన ఆయన దృక్పదాన్ని ఖచ్చితమైన రీతిలో ఆయన చెప్పాలి. ఆయన ఉద్దేశ్యానుసారం బైబిల్ మరియు కురాన్ రెండూ దైవ ప్రేరేపితాలైన గ్రంధాలా?? అందువలననే ఆయన బైబిల్ లోని వాక్యాలను ఆధారం చేసుకొని మొహమ్మద్ బైబిల్ లో చెప్పబడిన ప్రవక్త అని అంటున్నాడా?? బైబిల్ గ్రంధం దైవ ప్రేరితమైన దైవగ్రంధం గా ఆయన దానిని అంగీకరిస్తాడా లేక ఆయన కు నచ్చిన భాగాలు మాత్రమే వాడుకొని మిగిలినవి తుంగలో తొక్కుతాడా??
ఆయన ఇంతకు ముందు చేసిన ప్రసంగం అయిన “యేసు సిలువాస్తవాలు” అనే వీడియో లో స్పష్టం గా బైబిల్ పరిశుద్ధాత్మ చే ప్రేరేపించ బడిన గ్రంధమే నా?? అని ప్రశ్నించాడు. ప్రశ్న రూపం లో అడిగినా ఆయన తాత్పర్యం మాత్రం కాదు అనే! ఒక వేళ బైబిల్ గ్రంధం సంపూర్ణం గా దైవ ప్రేరితమైనదయితే దానిని సంపూర్ణం గా గ్రహించగలగాలి లేక పోతే దానిని విస్మరించి తన పని తాను చేసుకు పోవాలి. ఇక్కడ షఫీ లాంటి వాళ్ళ కు వింతయిన చిక్కు ఏమిటంటే వారు బైబిల్ ను సంపూర్ణం గా దైవ ప్రేరేపితం అని అనరు. ఎందుకంటే అది కురాన్ ను దైవ ప్రేరిత గ్రంధం గానూ, మొహమ్మద్ గారిని ప్రవక్తగానూ అంగీకరించదు కనుక. అలా అని బైబిల్ దైవ ప్రేరితం కాదు అని అంటే కురాన్ అందుకు ఒప్పుకోదు. కురానే ముస్లిములకు, బైబిల్ చదివి మొహమ్మద్ గురించి అక్కడ వ్రాసి ఉన్న విషయాల ఆధారంగా తమ విశ్వాసాన్ని మరియు మొహమ్మద్ గారి గురించిన ప్రవచనాలు తెలుసుకోవలసిందిగా ఆజ్ఞాపిస్తుంది. ఈ చిక్కు లోనుండి బయటపడే వ్యర్థ ప్రయత్నం ముస్లిము దావా ప్రచారకులు చాలా శతాబ్దాలుగా చేస్తూనే ఉన్నారు. కాక పోతే వారికి ముందు పోతే గొయ్యి వెనక్కి పోతే నుయ్యి లాంటి ఈ పరిస్థితి మింగుడు పడటం లేదు.
ఇక విషయానికి వస్తే షఫీ గారు తన ప్రసంగం లో మహాత్మా గాంధీ, జార్జి బెర్నార్డ్ షా వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన వారి పేర్లు చెప్పుకొని మొహమ్మద్ గారి గొప్పతనం చాటే ప్రయత్నం చేసారు. ఇలా చెప్పడం వల్ల షఫీ గారు ఏమి నిరూపించాలనుకుంటున్నారు? పదిమంది మంచి అని చెప్పే చోట ఇంకొ పది మంది చెడు కూడా చెబుతారు. చెడు చెప్పే వారిని విస్మరించి మంచి చెప్పే వారిని మాత్రమే పరిగణించడం ఎంత వరకు సమంజసం. మహాత్మా గాంధీ గారిని దేవుడని పూజించేవారు లక్షల సంఖ్యలో ఉన్నారు, అలాగే ఆయనను అంతగా ప్రేమించని వారూ లేక పోలేదు. మరి షఫీ గారు మహాత్మా గాంధిని ప్రేమించే వారు చాలా మంది ఉన్నారు కనుక ఆయనను దేవునిలా లేక ప్రవక్తగా లేక ఇంకొ మహా మనిషిగా ఒప్పుకుంటారా?? బహుశా ఇస్లాం అందుకు ఒప్పుకోదు. ఎందుకంటే వారి నిర్వచనం లో మహాత్మా గాంధీ గారు కాఫిర్ గనుక.అలాగే భిన్న ప్రజల ప్రమాణాల మేరకు భిన్న ఉద్దేశ్యాలు ఒక వ్యక్తి పై లేక ఒక సమాజం పై ఉంటాయి. దీని వలన షఫీ గారు ఏదీ నిరూపించ లేరు. మైకేల్ హార్ట్ గారి 100 ప్రభావ వంతమైన వ్యక్తులు అనే సర్వే ని ఆధారంగా చేసుకుని మొహమ్మద్ గారు అందరికంటే ఎక్కువగా ప్రభావశాలి అని చెప్పే ప్రయత్నం చేసాడు షఫీ. ఇలాంటి సర్వేల వల్ల మొహమ్మద్ గారి గొప్పతనం చెప్పడం సరే కానీ అదే సర్వే లో ఆ 100 మంది ప్రభావశాలులలో ఎంతమంది ముస్లిములు ఉన్నారు అని చూడండి. సుమారు 77 % మంది యూద – క్రైస్తవ సమాజానికి చెందిన వారు ఆ సర్వే లిస్టులో ఉన్నారు. ఇందులో ముస్లిములు కేవలం 2 % అంటే కేవలం ఇద్దరు. మరి 100 మందిలో తను కాక ఇంకోక్కరిని మాత్రమే ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి మొహమ్మద్ గారు ప్రభావితం చేయ గలిగారు అని అర్థం. ఇదే సర్వే లో నాస్తికులు 6 % మంది ఉన్నారు. అంటే యే మతము లేని వారు నూటికి ఆరు పాళ్ళు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంటే మొహమ్మద్ ప్రవక్త ప్రభావితం చేసిన వారు ఆ మాత్రం కూడా ప్రపంచానికి ఏమి చేయలేక పోయారా?? ఈ ప్రశ్న కు షఫీ గారు సమాధానం చెప్పి తీరాలి. ఇక హార్ట్ గారి సర్వే లేక రిసర్చ్ గురించి మాట్లాడుకుందాం. ఆయన ప్రభావితం చేసినవారు అని చెప్పే లిస్టు లో హింసకు పరాకాష్ట అయిన హిట్లర్ కూడా ఉన్నాడు సుమండీ అలాగే సృష్టి కి నాంది దేవుడు కాదు ఒక్క చాన్సు మాత్రమే అనే డార్విన్ ఉన్నాడు, అలాగే ముషులను ఊచ కోత కోసిన ఏందరో రాజులు కమ్మ్యూనిస్తులు మరియు మానసిక శాస్త్రం చదివి దేవుడు కేవలం మనుష్య సృష్టి అని చెప్పే సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా ఉన్నారు. వీరందరి ప్రభావం మంచికే దారి తీసిందా?? అవునని షఫీ చెప్పగలరా?? కనుక ప్రభావితం చేయడం అంటే మంచి చేయడం లేక మానవాళి శ్రేయస్సుకు తోడ్పడటం మాత్రమే కాదు విపరీత అర్థం తో కూడా ఆ పదమును వాడ వచ్చు అన్న మామూలు విషయం షఫీ గారికి నేను చెబితే తప్ప తెలియదు అని నేనుకోను. కనుక ఇలాంటి సర్వే ల పైన ఆధారపడటం కంటే మొహమ్మద్ గారిని ఇస్లాం యే విధంగా చిత్రీకరించిందో అదే విధం గా ప్రజలముందు ఉంచడం ఆయనకూ ఆ మతానికి అలాగే మన అందరికి కూడా మంచిది.
ఇక తన ఉపన్యాసం లోని బైబిల్ లో మొహమ్మద్ అనే రెండవ అంశం పరిశీలించి చూద్దాం.
సురా 7 :157 – “ఈ సందేశ హరున్ని – చదవనూ వ్రాయనూ రాని ఈ ప్రవక్తను అనుసరించేవారు (ఈ నాడు ఈ కారున్యానికి అర్హులు). అతని ప్రస్తావన వారికి తమవద్ద ఉన్న తౌరాతు, ఇంజీలు గ్రంధాలలో వ్రాయబడి లభిస్తుంది”.
పై ఆయతును ఆధారం చేసుకొని షఫీ గారు మొహమ్మద్ గారి ప్రాస్తావన బైబిల్ లో ఉంది అని చెప్పే ప్రయత్నం చేసారు. దాన్ని నిరూపిస్తూ ఈ రోజు అందుబాటులో ఉన్న బైబిల్ ను చదివి మనకు మొహమ్మద్గు గారి గురించి చెప్ప బడిన మాటలుగా ఆయన భావించే భాగాలను వివరించే ప్రయత్నం చేసారు. అయితే ఆయన ఈరోజు అందుబాటులో ఉన్న బైబిలే తౌరాతు మరియు ఇంజీలు గ్రంధాలు అని ఒప్పు కుంటున్నారా ?? అలా ఆయన ఒప్పుకుంటే సరే! ఎందుకంటే అదే గ్రంధం లో నుండి ఆయన ఎంచుకున్న విషయాన్ని సునాయాసంగా కొట్టి పారవేయ వచ్చు. అలా ఒప్పుకోకుండా ఇప్పుడు ఉన్న బైబిల్ గ్రంధం తౌరాతు మరియు ఇంజీలు కాదు అంటే మరి ఆయన బైబిల్ గ్రంధాని చదువుతూ ఆయన తన సందేశాన్ని మనకు ఎందుకు చెప్పారో వివరించాలి.
ఇదే పందా లో సురా 5 : 43 – 45 లో కురాన్ అప్పటికి వారి చేతిలో ఉన్న తౌరాతు మరియు ఇంజీలు దేవుని చే పంప బడినవి గానూ దాని ప్రకారం తీర్పు తీర్చ వచ్చునని చెబుతోంది. అలాగే తౌరాతులోని ఆయతుల ఆధారముగా తీర్పు తీర్చని వారే అవిశ్వాసులు అని కూడా కురాన్ చెబుతోంది. అలాగే 45 వ వచనములో అలా తీర్పు తీర్చని వారిని దుర్మార్గులు అని కూడా కురాన్ పేర్కొంటోంది. ఈ 5 వ అధ్యాయం 43 నుండి 45 ఆయతులలో వ్రాసిన శాస్త్రం (ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు కన్ను, ముక్కుకు బదులు ముక్కు – నిర్గమ 21 : 22 -25 ) ఇప్పటికీ బైబిల్ లో ఉంది. అంటే ఈ రోజు మన చేతిలో ఉన్న బైబిల్ మొహమ్మద్ సమయం లో ఉన్న బైబిల్ ఒకటే అని మనకు ఈ నిదర్శనం చాలదా?? ఇబ్న్ కతిర్ అనే మొహమ్మద్ యొక్క అనుచరుడు ఇలా అన్నాడు – ఒక వ్యభిచారి గురించి తీర్పు చెబుతూ మొహమ్మద్ గారు అక్కడి యూదుల వద్ద ఉన్న తౌరాతును తెప్పించి కురాన్ ను దాని దగ్గర ఉంచి “నేను నిన్ను మరియు నిన్ను బయలు పరిచిన దేవుని నమ్ముతున్నాను” అని చెప్పారు అని వ్రాసాడు.
అలాగే సురా 5 : 46 లో యేసు తన కాలం లో ఉన్నటువంటి తౌరాతు గ్రంధం లోని విషయాన్ని ధృవీకరించే వాడు అని వ్రాయ బడి ఉంది. తన కాలం లో అన్న పదం అరబీ భాష లో “బైన యదైహి” అని వ్రాయబడి ఉంది. దానికి అర్థం ఆయన చేతుల మధ్య ఉన్న అని అర్థం. అంటే యేసు చేతులమధ్య ఉన్న తౌరాతు గ్రంధం అని అర్థం. మన వద్ద ఈ రోజుకు కూడా యేసు కాలం నాటి తౌరాతు గ్రంధం డేడ్ సి స్క్రాల్ రూపం లో భద్ర పరచబడి ఉంది. ఇది నిజం కాదు అని షఫీ చెప్పగలరా?? ఇది చారిత్రాత్మకం కాదు అని షఫీ చెప్ప గలరా?? అంటే కురాన్ యే తౌరాతు గురించి అయితే సురా 5 :46 లో చెబుతోందో అదే తౌరాతు గ్రంధం ఇప్పటికి మన చేతులలో ఉంది. కానీ ఇదే నిజమైతే కురాను చెప్పేదంతా నిజం కాదు అని కూడా ఇదే తౌరాతు నిరూపిస్తుంది. అది ఎలాగో ముందు చూద్దాం. అలాగే 47 వ వచనం లో మొహమ్మద్ కాలం లోని ఇంజీలును క్రైస్తవులకు తీర్పు తీర్చే ఆధారముగా పంపిచ్చాము అని కురాన్ చెబుతోంది. అంటే మొహమ్మద్ కాలం నాటి ఇంజీలు దేవుని చే పంప బడినది అని అర్థం. తౌరాతులాగే ఇంజీలుకూడా ఆ రోజు నుండి ఈరోజు వరకు వ్రాత ప్రతులలో భద్ర పరచ బడి ఉన్నది అని చరిత్ర మనకు సాక్ష్యం.
షఫీ గారు ఇచ్చే సమాధానం కొరకు యావత్ క్రైస్తవ్యం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రగాల్పాలు పలికిన యే ముస్లిం దావా ప్రచారకుడు ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదు. అయినా షఫీ లాంటి వారు చెప్పే సమాధానాలు ఇలా వుంటాయి:
ఇప్పటి బైబిల్ మొత్తం దేవుని వాక్యం కాక పోయినా అందు లో ఇంకా అక్కడక్కడా దేవుని సందేశం ఉంది. – బహుశా షఫీ గారు ఇలాంటి వ్యర్థ ప్రయత్నం ఇంకొ సారి చేస్తారేమో అని ముందే ఈ సమాదానం వ్రాస్తున్నాను. ఒక వేళ షఫీ గారు అప్పుడు పంపబడిన వి కేవలం తౌరాతు, ఇంజీలు మరియు ప్రవక్తల గ్రంధాలు మాత్రమే అవికూడా క్రైస్తవులు తారు మారు చేసారు అని అన వచ్చు. అయితే ఆ తారు మారు ఎప్పుడు ఎక్కడ ఎవరు చేసారో చెప్పాలి. మొహమ్మద్ సమయం వరకు చక్కగా ఉన్న గ్రంధాలను తారు మారు చేయటానికి క్రైస్తవులకు ఉన్న అవసరం ఏమిటి? ఒక వేళ తారు మారు చేసి ఉంటె అదే పుస్తకం నుండి మొహమ్మద్ గారిని ప్రవక్త గా షఫీ గారు ఎందుకు నిరూపించాలనుకుంటున్నారు?
కనుక షఫీ గారికి బైబిల్ వక్రీకరించ బడని, దైవ గ్రంధం అని ఒప్పుకోవడం కన్నా వేరే గత్యంతరం లేదు. అలా ఒప్పుకుంటే మొహమ్మద్ గారు ప్రవక్తగా అంగీకరించ యోగ్యుడా అనే విషయం తరువాత చర్చిద్దాం.
షఫీ సురా 96 ను యోషయ 29 తో కలిపి, చదువు రాని ప్రవక్త మొహమ్మదే అని చెప్పటం మనం చూడవచ్చు.
షఫీ మొహమ్మద్యొ గారి యొక్క జీవిత కథ సిరా (కురాన్ కాదు ) ను ఆధారం చేసుకుని ఈ మాట రుజువు చేసుకునే ప్రయత్నం చేసాడు కనుక మనం కూడా అదే పద్ధతి అవలంబిద్దాం.
కురాన్ మొహమ్మద్ గారిని చదువురాని ప్రవక్తగా చాటుతోందా?
సురా 7 ను ఇంకొ సారి చదివిచూద్దాం. ” చదవనూ వ్రాయనూ రాని ఈ ప్రవక్తను” అన్న మాటను అరబీ భాష లో “అల్ నబియ్య అల్ ఉమ్మియ్య” అని వ్రాసారు. ఉమ్మి అనే అరబీ పదానికి చదువురాని వాడు అని అర్థం అని ముస్లిములు చెప్పడం మనకు విధితమే.
కురాన్ మొహమ్మద్ గురించి చెబుతూ 29 :48 లో “ప్రవక్తా నీవు ఇంతకు పూర్వం యే గ్రందాన్నీ చదివే వాడవు కావు: నీ చేతితో వ్రాసే వాడవూ కావు” అని అంటుంది. అంటే కురాన్ కంటే ముందు మొహమ్మద్ గారు యే గ్రందాన్నీ చదివే వాడు కాదు అని అర్థమే కానీ అసలు ఆయనకు చదవడం వ్రాయడం రాదు అని కాదు కదా!
కనుక కురాన్ లో ఉమ్మి అనే అరబీ పదం యొక్క ప్రయోగం ఎలాంటి సందర్భాలలో జరిగిందో ఒక సారి చూద్దాం. సురా 3 : 20 లో “గ్రంధం కలవారినీ గ్రంధం లేని వారినీ ఉభయులనూ ఇలా అడుగు” అంటూ గ్రంధం లేని వారు అనే దగ్గర “అల్ – ఉమ్మియ్యీన” అనే పదం వాడటం జరిగింది. ఉమ్మియ్యీన అంటే గ్రంధం చదవని వారు లేక గ్రంధం లేని వారు అని అర్థం. అలాగే 3 : 75 లో “ఉమ్మీల వ్యవహారం లో మమ్మల్ని పట్టుకోవటం జరగదు” అని యూదులు అన్నట్టు కురాన్ లో ఉంది. ఇక్కడ ఉమ్మీలు అనగా యూదేతరులు లేక పుస్తకము చదవని వారు అని అర్థం. అలాగే 62 :2 లో “ఆయనే ఉమ్మీలలో ఒక ప్రవక్తను స్వయంగా వారినుండే లేపాడు” అని వ్రాసి ఉంది. ఇక్కడ ఉమ్మీలు అంటే చదవడం వ్రాయడం రాని వారు అనా?? అరబ్బులెవ్వరికీ చదవడం వ్రాయడం రాదా?? అలా కాదు. గ్రంధం లేని ప్రజలు, లేక గ్రంధం చదవనిప్రజలైన, యూదేతరులైన అరబ్బులు అని అర్థం. మరి కురాన్ ఇన్నిసార్లు “ఉమ్మీ” అనే పదాన్ని గ్రంధం లేని లేక గ్రంధం చదవని వారికి ఆపాదిస్తూ ఉంటె కేవలం మొహమ్మద్ గారికి ఈ పదాన్ని చదవడం వ్రాయడం చేతకాని వాడిగా చెప్పడానికి ఆపాదిన్చాల్సిన అవసరం ఏమిటి?? ఇది ఇస్లామీ దావా ప్రచారకుల వక్ర అనువాదం మాత్రమే. ఇంకా చూస్తే మొహమ్మద్ గారు తన ప్రవచనం పొందక మునుపు ఖదీజా వద్ద వ్యాపార సహాయకుడిగా ఉన్నట్టు మనం చూస్తాం. ఆ పని మీదుగా ఎన్నో ప్రదేశాలు తిరిగినట్టు, నమ్మకంగా లెక్క చెప్పినట్టు కూడా చూస్తాం. అలాంటప్పుడు ఆయన బడికి వెళ్లి చదవక పోయినా అవసరమైనంత అక్షర జ్ఞానం తప్పక సంపాదించి ఉండాలి. లేక పోతే ఒంటెల కారావాన్లలో పోయే సొమ్మును లెక్కించి, దానికి బదులుగా రొక్కం జమ చేసి దానిని నమ్మక గా ఖదీజా కు ఇవ్వటానికి కొంత లో కొంతైనా చదువు తెలిసే ఉంటుంది అనటం లో పెద్ద వింత ఏమీ ఉండదు.
ఇక బైబిల్ చెప్పిన ఆ చదువు రాని ప్రవక్త ఎవరో చూద్దాం:
యోహాను 7 :15 -17 లో యేసు క్రీస్తు జ్ఞానం చూసిన యూదులు నివ్వెరపోతూ ఎప్పుడూ చదువుకోని ఇతనికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని అంటున్నారు. కనుక యేసు లోనే ఆ ప్రవచనం పూర్తి అయిపొయింది అనేది క్రైస్తవ విశ్వాసం.
ఇక ద్వితీయోపదేశ కాండము 18 వ అధ్యాయమును ఆధారము గా చేసుకుని షఫీ వంటి ఇస్లామీ దావా ప్రచారకులు చేసే వక్ర బోధలను చూద్దాం. షఫీ గారి వాదన ఏమిటంటే: ద్వితీయోపదేశ కాండం 18 : 18 ప్రకారం ఆ వచనములో ప్రవచింప బడిన ప్రవక్త మొహమ్మద్ మాత్రమే ఎందుకంటే, అక్కడ చెప్పబడిన 1 ) వారి సహోదరులలోనుండి 2 ) నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను, 3 ) అతని నోట నా మాటల నుంచుదును , 4 ) నేను అతనికి ఆగ్నాపించినది యావత్తును అతడు వారితో చెప్పును 5 )18 :19 అతడు నా నామమున చెప్పు నా మాటలను, అనే మాటలు మొహమ్మద్ గారి జీవితం లోనే నెరవేరాయి. కనుక మొహమ్మద్ గారు మాత్రమే ఆ ప్రవచనమునకు సరియైన వ్యక్తి అనేది షఫీ గారి బోధ.
ఎంతో కాలం నుండి ముస్లిములు జబర్ దస్తీ గా బైబిల్ గ్రంధం లో మొహమ్మద్ ను వెతుకుతూ ఉన్నారు ఎందుకంటే మొహమ్మద్ గారు తన గురించి బైబిల్ లో (కితాబ్ లో) వ్రాసి ఉంది అని చెప్పాడు కనుక. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే మొహమ్మద్ గారు బ్రతికి ఉన్న రోజులలో కూడా బైబిల్ గ్రంధం అందుబాటులో ఉండెడిది. మొహమ్మద్ గారు నిజంగా ఆ విషయాన్ని ప్రజలకు రుజువు పరచాలి అని అనుకుంటే అప్పుడే ఆ బైబిల్ లేక కితాబు ను తెప్పించి అందరిముందు ద్వితీయోపదేశ కాండం చదివి ఇక్కడ ప్రకటించ బడింది నా గురించే అని ఎందుకు చెప్పలేదు? షఫీ గారి వంటి ఇస్లామీ దావా ప్రచారకులకు తట్టిన ఆ ఆలోచన మొహమ్మద్ గారికి తట్టలేదే ? షఫీ గారికి ఉన్న ఆలోచన కూడా మొహమ్మద్ గారికి లేదా? ఒక వేళ అలా ఆయన విడమరిచి చెప్పి ఉంటె అది సంపూర్ణ సత్యం గా చెప్పబడిన కురాన్ లో ఎందుకు లేదు? కురాన్ 12 :111 “ఇది (కురాన్) తాను స్వయముగా సృష్టించిన విషయము కానే కాదు, ఇది తమకు పూర్వపు అల్లాః సందేశ భావిష్యద్వానులను సంపూర్ణముగా పూర్తి చేయును, ప్రతి విషయమును వివరించునది అయి ఉన్నది” ప్రకారం కురాన్ గ్రంధం సంపూర్ణంగా వివరించి చెప్ప బడినది. మరి ఇలాంటి కురాన్ లో మొహమ్మద్ గారు బైబిల్ గ్రంధం లో ఎక్కడ చెప్పబడ్డారు అన్న వివరణ లేదేం? కురాన్ లో సైన్సు గురించి ఉంది, పిండ శాస్త్రం గురించి ఉంది, ఇంకా ఏదేదో ఉంది అని చెప్పుకు తిరిగే దావా ప్రచారకులకు కనీసం మొహమ్మద్ గారి గురించి బైబిల్ లో యే పుస్తకం లో యే అధ్యాయం లో వ్రాసి ఉంది అన్నవిషయమును స్పష్టం గా కురాన్ లో నుండి ఎందుకు చూపలేక పోతున్నారు? ఒక వేళ ఇంత మూల విషయము లోనే కురాన్ స్పష్టత ఇవ్వటం లేదు అని షఫీ లాంటి దావా ప్రచారకులు ఒప్పుకుంటే మరి కురాన్ గ్రంధం లోని 12 :111 వచనం తప్పు అని చెప్పగలరా? ఇవన్ని అలా ఉంచి ఇంకొ కోణం లో ఆలోచిస్తే ఇప్పటి బైబిల్ మొహమ్మద్ చెప్పిన కితాబెనా? అన్న ప్రశ్న ముందు అడగాలి ఒక వేళ అది నిజం అయితే మరి ఆ బైబిల్ ను దేవుని వాక్యం గా అంగీకరిస్తారా అని అడగాలి! కాదు మొహమ్మద్ చెప్పిన తౌరాత్ మరియు ఇంజీల్ ఇప్పటి బైబిల్ కాదు అంటే మరి జబర్దస్తీగా మొహమ్మద్ గారిని బైబిల్ లో ఎందుకు వెతుకుతున్నారో చెప్పాలి. ఈ ప్రశ్నకు షఫీ వంటి వారు చెప్పే సమాధానం ఏమిటంటే యూదులు, క్రైస్తవులు బైబిల్ గ్రంధాన్ని తారు మారు చేసినప్పటికీ అందులో కొన్ని సత్యాలు, ముఖ్యంగా మొహమ్మద్ గారి గురించిన సత్యాలు మాత్రం తారు మారు చేయలేక పోయారు అని! దీనినే వితండ వాదం అంటారు. మీకు నచ్చిన వాక్య భాగాలేమో దైవ వాక్యాలు, మీకు నచ్చనివేమో దైవ వాక్యాలు కావు! తనకో నీతి పక్కోడికో నీతి అంటే ఇదే! ఇదే విధంగా కురాన్ ను చదివి తే ముస్లిము సోదరులు ఒప్పుకుంటారా?
వారి సహోదరులలో నుండి: అబ్రహాము సంతతి అయిన ఇస్సాకు మరి యు ఇస్మాయేలులు అన్నదమ్ములు లేక దాయాదులు గనుక వారి పిల్లలు అన్నదమ్ములు లేక సహోదరులు అవుతారు అని షఫీ గారి వాదన. అయితే బైబిల్ గ్రంధం లోని పాత నిబంధన గ్రంధం లో సహోదరులు అనే మాట ఎప్పుడెప్పుడు ఎవరెవరిని సంబోధిస్తూ వ్రాయబడిందో చూద్దాం – నిజం యిట్టె నిరూపించ బడుతుంది.
షఫీ గారు వాడిన ద్వితీయోపదేశ కాండం లోనే ఒక్క అధ్యాయానికి ముందు వెళితే సహోదరులు అనే మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబదినదో తెలిసి పోతుంది:
ద్వితీయోపదేశ 17 : 14 -15 – నీ దేవుడైన యెహోవా నీకిచ్చు చున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీన పరచుకొని అందులో నివసించి – నా చుట్టూ ఉన్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించు కొందు ననుకోనిన యడల, నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీమీద రాజుగా నియమించు కొన వలెను. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించు కొన వలెను. నీ సహోదరుడు కాన్ అన్యుని నీమీద నియమించు కొన కూడదు. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే యెహోవా ఇస్రాయేలీయులతో పలికిన ఈ మాటలు షఫీ గారు తీసుకున్న మాటల సందర్భం లోనిదే, మరియూ ఇశ్రాయేలీయులు వారి పై రాజుగా నియమించు కొనటానికి అరబ్బులకోసం వేచి చూడలేదు!! షఫీ గారి ప్రకారం వారు అరబ్బులను తమ పై రాజుగా చేసుకోవాలి మరి! కానీ ఇస్రాయేలీయులకు మాత్రం వారి భాషలో తమ ఇశ్రాయేలు సమాజం లేక యూదులలో నుండే రాజును ఏర్పరచు కోవాలి అని అర్థం అయింది మరి!
ద్వితీయోపదేశ 18 : 1 -2 – యాజకులైన లేవీయులకు, అనగా లేవీ గోత్రీయుల కందరికీ ఇస్రాయేలీయులతో పాలైనను స్వాస్త్య మైనను ఉండదు, వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు: అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్త్యము కలుగదు. యెహోవా వారితో చెప్పినట్టు ఆయనే వారి స్వాస్త్యము…
ఇక్కడ యెహోవా లేవీయులతో అరబ్బులనుండి మీకు స్వాస్థ్యం ఉండకూడదు అని ఎందుకు చెప్పాలి? ఇది లేవీ గోత్రేయుల సహోదరులు అయిన ఇస్రాయేలీయులను గురించి చెప్పిన మాట అని అర్థం చేసుకోవడానికి తత్వ జ్ఞానం తెలియక్కర్లేదు కదా!!
ఇదే కోవలో సంఖ్యా 8 :26 , న్యాయాధిపతులు 20 :13 ,2 సమూఎలు 2 : 26 లలో కూడా మీ సహోదరులలో అన్న మాటకు సందర్భానుసారంగా ఇస్రాయేలీయులలో అనే అర్థం వస్తుందే తప్ప అరబ్బులైన ఇష్మాయేలీయులలో అనే అర్థం రాదు.
ఈ వివరణను ఒప్పుకోకుండా ఉండటానికి షఫీ గారు ఆశ్రయించిన వచనం ఆది కాండం 25 : 12 – 19 వరకు గల ఇష్మాయేలు వంశావళి. ఇందులో ఇస్మాయేలు ను అబ్రహాము కుమారునిగా చెప్పబడి ఉంది. కాక పోతే ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే ఇస్సాకు కు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇచ్చెను అని ఇదే అధ్యాయం (25 : 5 ) లో స్పష్టం గా చెప్పబడి ఉంది. అంటే వంశ పారంపర్యం గా సంక్రమించే పితరుల ఆస్తి, ఇంటి పేరు వాటిని అబ్రహాము ఇస్సాకు కు మాత్రమే ఇచ్చెను అని అర్థం. దీనినే ధృవీకరిస్తూ ఇదే అధ్యాయం (25 ; 1 – 5 ) లో అబ్రహాము మరల వివాహము చేసుకొనిన కేతురా అనే స్త్రీ వలన కలిగిన పిల్లలను, వారి వలన కలిగిన వంశములను కూడా చెప్పడం జరిగింది. కానీ వారికి అబ్రహాము సంతానము అన్న పేరు బైబిల్ గ్రంధం లో ఎక్కడా చెప్ప బడ లేదు. శారీరకంగా అబ్రహాము సంతానం అనగా ఇస్సాకు సంతానము మాత్రమే. హాగారు వలన కలిగిన ఇష్మాయేలు, కేతూరా వలన కలిగిన ఆషూరీయులు , లేతూశీయులు మొదలగు వారు అబ్రహాము సంతానముగా బైబిల్ గ్రంధం లో ఎక్కడా పిలవ బడ లేదు. అంతే కాక యెహోవా స్వయంగా అబ్రహాము తో చేసిన నిబంధన ఇదే ఆదికాండం 17 : 18 -21వరకు చూస్తే ఆ చిక్కు కాస్త విడిపోతుంది. యెహోవా అబ్రహాము తో చేసిన నిబంధన ఇష్మాయేలు హాగారు ద్వారా పుట్టిన తరువాత అన్న విషయం గుర్తుంచుకోవాలి.
” అబ్రహాము – ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు – నీ భార్య యైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. నీవాతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధన గా నా నిబంధనను అతనితో స్థిర పరచెదను. ఇష్మాయేలు ను గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వ దించి, అతనికి సంతానాభివ్రుద్ధి కలుగ చేసి, అత్యధికముగా అతనిని విస్తరింప చేసెదను: అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని గొప్ప జనముగా చేసెదను; అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకు తో నా నిబంధనను స్థిర పరచెదనని చెప్పెను” ఆది కాండం 17 : 18 – 21
కనుక అబ్రహాము సంతతిలో దేవుని నిబంధనను దేవుడే స్థిరపరచుటకు ఎంచుకున్న సమూహం ఇస్సాకు సంతానం. అంతే కానీ ఇష్మాయేలు, ఆశ్శూరీయులు మొదలగు వారు ముమ్మాటికి నిబంధనకు సంబంధించిన అబ్రహాము కుమారులు కారు. ఇంతకి నిబంధన ఏమిటి అంటే - ఆది కాండం 17 :2 – 8 ” నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిల పడియుండగా దేవుడతనితో మాట్లాడి – ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి యున్నాను; నీవు అనేక జనములకు తండ్రివగుడువు…..నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగచేసి నీలోనుండి జనములు వచ్చు నట్లు నిన్ను నియమిన్చుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత దేవుడనై ఉండు నట్లు, నాకును, నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిర పర చెదను”. కనుక దేవుడు స్థిర పరచిన నిబంధన నిత్య నిబంధన గా ఇస్సాకు లో మాత్రమే నని ఆదికాండం 17 : 18 -21 ప్రకారం మనకు స్పష్టం అవుతుంది. అంతేకాక యెహోవా దేవుడు ఆదికాండం 21 : 12 లో అబ్రహాము తో చెబుతూ ” ఈ చిన్న వాని బట్టియు (ఇష్మాయేలును బట్టియు) నీ దాసిని బట్టియు నీవు దుఃఖ పడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము: ఇస్సాకు వలన అయినదియే నీ సంతానము అనబడును” అని స్పష్టముగా వివరించినట్టు మనం చూడవచ్చు.
ఇవన్నీ తెలుసు కోకుండా షఫీ గారు అహ్మద్ దీదాత్ వంటి దావా ప్రచారకుల పందాలో గుడ్డిగా కొన్ని బైబిల్ వచనాలు వల్లించటం వల్ల ఒరిగేదేమీ లేదు. ఏదైనా ఒక విషయమును సంపూర్ణం గా తెలుసుకొని దాని గురించి మాట్లాడటం ఉచితమైన పద్ధతి అని నా అభిప్రాయం. నిజా నిజాలు తెలుసుకోకుండా క్రైస్తవులకు నీతివాక్యాలు బోధించే ప్రయత్నం షఫీ గారు చేస్తూ నిన్ను వలె నీ పొరుగు వారినిప్రేమించు అని బైబిల్ గ్రంధం లో ఉంది కనుక ఇష్మాయెలీయుల ను చులకన భావం తో చూడ రాదు అని చెప్పారు. అయితే ఆయనకు అర్థం కానీ విషయం ఏమిటంటే నిజం చెప్పడం చులకన చేయడం కాదు. ఇష్మాయేలు దేవుని నిబంధన ప్రకారం అబ్రహాము సంతానం కాదు అని బైబిల్ చేబుతోందే కానీ ఆయన అసలు అబ్రహాము కుమారుడే కాదు అని చెప్పడం లేదు. ఇష్మాయేలు లాగే ఇంకా చాలా మంది అబ్రహాముకు సంతానం గా ఉన్నారు. కానీ దేవుని నిబంధన ఇస్సాకులో మాత్రమే నిత్య నిబంధన గా నిలిచి ఉంటుంది అన్నది బైబిల్ చెప్పే సత్యం. కనుక రెండు సంబంధం లేని విషయాలను మోకాలికి బోడిగుండుకు ముడివేసే విధంగా కలిపే ప్రయత్నం షఫీ గారికి శోభాయ మానం కాదు.
ఇంకా సాగదీస్తూ షఫీ గారు ఆది కాండం 12 : 3 ను చూపిస్తూ “నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూశించువాని శపించెదను” అన్న విషయాన్ని వల్లిస్తూ ముస్లిములు మాత్రమే దరూద్-యే- ఇబ్రాహీం అనే ఆయతును చదువుతూ అబ్రహామును గౌరవిస్తారు అని చెప్పుకొచ్చారు. అంటే ఆయన ఉద్దేశ్యం లో రోజు మేము అబ్రహామును ఆశీర్వదిస్తున్నాము అని చెబితే ఆయనను ఆశీర్వదించినట్టు, లేక పోతే లేదు!! బైబిల్ నేర్పే సూత్రము అది కాదు. అబ్రహామును ఆశీర్వదించటం అంటే ఆయన ఎన్నుకున్న విశ్వాస మార్గమును ఎన్నుకొని, ఆయన సంతానము గా పిలువ బడటం. నిబంధన ప్రకారం అబ్రహాము సంతానమైన ఇస్రాయేలీయులను, నూతన నిబంధన ఆధారముగా క్రైస్తవులను ఆశీర్వదించటం. రోమా 4 :3 ప్రకారం క్రియల పై కాక విశ్వాస మూలముగా నీతిమంతునిగా పిలువబడి అబ్రహాము లా విశ్వాస మూలమైన నీతి మార్గం లో నడవటం. అది అబ్రహామును ఆశీర్వదించటం అంటే! అబ్రహాము విశ్వాసము ఆయనకు నీతి ఆయెను అదే విధముగా ఎందరైతే విస్వాసమూలమైన నీతిని పొందుదురో వీరు అబ్రహాము కుమారులు అని రోమా 4 మరియు హెబ్రీ 6 లో మనం స్పష్టంగా చూడవచ్చు.ఆ మార్గమును వ్యతిరేకించటమే ఆయనను దూషించటం. షఫీ గారు యే కోవకు చెందుతారో ఆయనే చెప్పాలి.నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను: షఫీ గారి వాదన లో రెండవ అంశం మొషే వంటి ప్రవక్త. అందుకు గాను షఫీ గారు మోషేకి మొహమ్మద్ కు గల సమతుల్యములను చెప్పటం గమనించగలం. అవి ఏమిటంటే: మొషే జీవనవిధానం మరియు అయన సందేశ కార్యక్రమం, మొహమ్మద్ గారి జీవన విధానం మరియు సందేశ కార్యక్రమం తో సరిపోవుట, మొషే మరియు మొహమ్మద్ లు సహజం గా నే జన్మించుట మరియు సహజంగా మరణించుట, మొషే మరియు మొహమ్మద్ లు వివాహాది సామాజిక కార్యములు తమ జీవితాలలో జరిగించుట, మొషే మరియు మొహమ్మద్ లు ధర్మ శాస్త్రము ను తెచ్చుట, వారిరివురు ప్రజల చె అంగీకరించబడుట మరియు మొషే మరియు మొహమ్మద్ లు దేవునితో సంభాషించుట.
షఫీ గారు తనకు ఇష్టం వచ్చిన గుణ గణాలను మాత్రమే బూతద్దం లో చూసి మొషే మరియు మొహమ్మద్ ల జీవితాలలోని సమతుల్యాన్ని చెప్పి, తన విషయమును రుజువు పరుచుకోవాలనే ప్రయత్నం చేసారు. ఇక సంపూర్ణ దృక్కోణం లో ఒక్క సారి మొషే మరియు మొహమ్మద్ ల జీవన శైలి పరిశీలిద్దాం.

నిర్గామా 33 :11 – “మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మొషే తో ముఖా ముఖి గా మాటలాడుచుండెను. తరువాత అతను పాలెము లోనికి తిరిగి వచ్చు చుండెను.”

ద్వితీయోపదేశ 34 :10 -12 – “ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని, అతని దేశ మంతటికిని, యే సూచక క్రియలను, మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో, వాటి విషయములోను, ఆ బాహుబలమంతటి విషయములోను, మొషే ఇశ్రాయేలు జనులంతటి ఎదుట కలుగచేసిన మహా భయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖా ముఖిగా ఎరిగిన మొషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయెలీయులలో ఇదివరకు పుట్ట లేదు”

ఇక్కడ గమనించవలసిన రెండు మిఖ్య మైన విషయములు ఏమిటంటే – మొషే దేవునితో ముఖా ముఖిగా స్నేహితునివలె మాట్లాడుట, మరియు సూచక క్రియలు, మహాత్కార్యములు చేయుట.

పెండ్లి చేసుకోవడం, పిల్లలను కనడం, పుట్టడం, చనిపోవడం వంటి సహజ మైన విషయాలను పట్టుకుని ఇద్దరికీ సమతుల్యాలు చూపించటం అవివేకం, ఎందుకంటె, ఈకాలం లో భారత దేశానికి రాజ్యాంగం తెచ్చిన అంబేద్కర్ గారు మరియు ఎంతో మంది సామాజిక కార్యకర్తలు కూడా అదే సమతుల్యములు కలిగి ఉన్నారు మరియు ధర్మ శాస్త్రమును ప్రజలకు అందించారు.

మొహమ్మద్ గారు మొషే లాగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడా?

మొహమ్మద్ గారు సూచక క్రియలు మరియు మహాత్కార్యములు ప్రజలందరి ఎదుట చేసారా?

ఈ విషయాలు సంపూర్ణ వివరణ కలిగిన కురాన్ గ్రంధం లో ఉన్నాయా?

సురా 13 :7 – “నీ మాటను నిరాకరించు వారు ‘ఈ మనిషి వద్దకు ఇతని ప్రభువునుండి ఏదైనా మహిమ/ సూచక క్రియ ఎందుకు రాలేదు? అని అంటున్నారు. కానీ నీవు(దుష్పరినామాలనుండి) హెచ్చరించేవాడివి మాత్రమే”

పైవచనము ప్రకారం మొహమ్మద్ కేవలం హెచ్చరించుటకు మాత్రమే పంపబడ్డారు కానీ సూచక క్రియలు లేక మహాత్కార్యములు చేయటానికి కాదు. షఫీ వంటి దావా ప్రచారకులు ఒక వేళ లేదు సూచక క్రియలు హద్దీసులలో నమోదు చేయబడ్డాయి అని చెబితే అప్పుడు సంపూర్ణ వివరణ ఇచ్చే కురాను గ్రంధం లో అవి ఎందుకు నమోదు చేయబడలేదో చెప్పాలి?అలాగే కురాన్ గ్రంధం సంపూర్ణ వివరణ ఇచ్చే గ్రంధం కాదు అని కూడా ఒప్పుకోవాలి. ఒక వేళ వారు అల్లాః మొహమ్మద్ గారికి పంపిన కురాన్ గ్రంధమే ఒక సూచక క్రియ లేక మహత్కార్యం అని అంటే అది కూడా పొరబాటే, ఎందుకంటే మొషే దేవుని వాక్యమైన మహత్కార్యం తో పాటు ఇంకా చాలా మహాత్కార్యములు మరియు సూచక క్రియలు కూడా చేసారు. కనుక మొహమ్మద్ గారు మొషే వంటి ప్రవక్త కాదు అని ఒప్పుకోవాలి.

ఇక దేవుని తో ముఖా ముఖి గా మాట్లాడటం అనే విషయమును చూద్దాం. కురాన్ గ్రంధం సురా 4 : 164 లో మొషే దేవునితో ముఖా ముఖిగా మాట్లాడినట్టు వ్రాయ బడి ఉంది. అయితే షఫీ గారు తెలివిగా మొహమ్మద్ గారు మీరాజ్ అనే యాత్ర లో దేవుని తో సంభాషించారు అని చెప్పడం మనం గమనించ గలం.

కాక పోతే అది ఎక్కడ వ్రాయబడి ఉందొ చెప్పలేదు. అది నిజమైన యాత్రా లేక స్వప్నమా చెప్పలేదు! అందును గూర్చిన వివరణ మనం చూద్దాం. మొహమ్మద్ గారు చేసిన రాత్రి ప్రయాణం మొత్తం కురాన్ లో ఒకే ఒక్క చోట నమోదు చేయబడి ఉంది. అది సురా 17 :1 “దేవుడు తన నిదర్శనములను చూపడానికి ఒక రోజు రాత్రివేళ తన దాసుణ్ణి కాబా మసీదు నుండి దూరముగా ఉన్న అఖ్సా మసీదు దగ్గరకు తీసికెళ్ళాడు. ఆ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం చేసాడు ”

అతి దూరముగా ఉన్న మసీదు అనగా “మస్జిద్-అల్ – అక్సా” అనే మసీదు ను మొహమ్మద్ ఆ రాత్రి దినమున అల్-మిరాజ్ అనే ప్రయాణం లో ఇస్లామీ సాహిత్యం ప్రకారం అంటే కేవలం కురాన్ లో వ్రాసినది మాత్రమే కాక మిగితా హద్దీసులలో వ్రాయ బడిన సమాచారం ప్రకారం మొహమ్మద్ గారు ముందు గాబ్రిఎలు దూత చె నిద్ర నుండి లేప బడి, గాబ్రిఎలు మొహమ్మద్ చాతిని చీల్చి జిం జిం అనే నీటి తో ఆయన హృదయమును కడిగి, బురాక్ అనే జంతువు పై ఆయనను ముందు ఎరుషలేము లో ఉన్న అల్-అక్సా మసీదుకు తీసుకుని పోయి అక్కడినుండి జ్యోతులు గల నిచ్చెన పై పరలోకమునకు తీసుకు పోయినట్టు నమోదు చేయబడి ఉంది. ఇక్కడ ఎంత గింజుకున్నా సీరత్ రసూల్ అల్లాః ప్రకారం మొహమ్మద్ గారు అల్లా తో రోజువారీ ప్రార్థనల సంఖ్య తగ్గించుకోనేందుకు అర్జీ పెట్టుకున్నట్టు మాత్రమే నిరూపించగలరు కానీ దేవుని తో ముఖా ముఖిగా మాట్లాడిన సందర్భం కురాన్ లో ఎక్కడా లేదు. ఇంకా పోతే మొషే స్వయం గా దేవుని మాటలనే పుస్తకం లో వ్రాసారు కానీ యే దూత ఆయనకు ఆ మాటలను తెచ్చి అంద జేయలేదు.కానీ ఇస్లామీ సాహిత్యం ప్రకారం గాబ్రిఎలు దూత కురాన్ ను మొహమ్మద్ వద్దకు తెచ్చి ఇచ్చారు. ఇంకొంచం లోతుకు వెళితే, ముందు మొహమ్మద్ గారు ప్రయాణం చేసి చేరుకున్న మస్జిద్ అల్ అక్సా అప్పటికి (చరిత్ర ప్రకారం) కూలిపోయి పునర్ నిర్మాణమునకు నోచుకోలేదు. కనుక కురాన్ గ్రంధం ఈ విషయం లో సరైన దేనా అనే ప్రశ్న కూడా తలెత్తు తుంది.

ఇది కాక ముస్లిములలో అల్ మిరాజ్ అనే ప్రయాణం భౌతిక మైనది కాదు అది కేవలం ఆత్మీయ ప్రయాణం అని చెప్పే పండితులూ లేక పోలేదు. ఇబ్న్ ఇషాక్ వ్రాసిన సూరత్ రసూల్ అల్లాః అనే పుస్తకం 186 వ పేజీ లో ఆయిష “మొహమ్మద్ గారి శరీరం ఇక్కడే ఉండగా ఆయన ఆత్మ మాత్రమే ప్రయాణమునకు పోయింది అని చెప్పినట్టు”నమోదు చేయబడి ఉంది. కనుక కురాన్ ప్రకారం మొహమ్మద్ గారు అల్లాః తో ముఖా ముఖి గా మాట్లాడినట్టు లేదు, మిగితా ఇస్లామీ సాహిత్యం లో కూడా అల్లాః తో మొహమ్మద్ కేవలం ప్రార్థనలను తగ్గించే అర్జీ పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి కానీ ముఖా ముఖిగా మాట్లాడి కురాన్ ఆయతులను ప్రజలకు అందించి నట్టు ఎక్కడా లేదు. అలాగే మొషే దేవుని తో మాట్లాడుటకు ముందు ఆయన చాతిని చీల్చి హృదయమును కడిగిన దాఖలాలూ లేవు!

కనుక సూచక క్రియలు చేయటం లోను మరియు దేవునితో ముఖా ముఖిగా మాట్లాడటం లోను మొహమ్మద్ గారు మొషే ని పోలి లేరు.ఇక మిగితా విషయాలు చూద్దాం:

జననం లో సమతుల్యత : మొషే జన్మించిన సమయం లో ఐగుప్తు దేశపు రాజు ఫరో జన్మించిన ప్రతి మగ శిశువును హత మార్చే లా శాశనం చేసాడు, కానీ మొషే ఫరో ఇంట్లో నే పెంచుకున్న బిడ్డ గా పెరిగి పెద్ద వాడై సకల విద్య లు నేర్చాడు. మరి మొహమ్మద్ గారి జీవితం లో ఇలా జరిగిందా?

మరణం లో సమతుల్యత: మొషే వృద్ధాప్యం లో తను యే నిబంధన చొప్పున ఇశ్రాఎలీయులను కనాను దేశానికి నడిపించేనో ఆ దేశములో ఆయన ప్రవేశింప లేక పోయి ఒక కొండ పై సహజ మరణం పొందెను, మరి మొహమ్మద్ గారు చని పోవటానికి గల కారణాలు నా కంటే బాగా షఫీ గారికే తెలుసు. తన భార్యలలో ఒక రైన జైనబ్ బింత్ అల్ హరిత్ మొహమ్మద్ గారికి విషం పెట్టటం మూలం గా ఆయన కు సంక్రమించిన రోగం కారణం గా అయన మరిఅనించాడు అన్న విషయం ఇస్లామీ హద్దీసులు, సహి బుఖారి, సీరత్ అల్ రసూల్ అల్లాః లు, నొక్కి వోక్కానిస్తున్నాయి. మొషే గారు మాత్రం చనిపోవడానికి ముందు దృష్టి మాంద్యం లేక, సత్తువ తగ్గని వాడై మరణించెను అని ద్వితీయోపదేశ కాండం 34 :7 చెబుతోంది. మరి వీరిరువురు మరణం లో సమతుల్యులా??

ఇలా దేవుడు చెప్పని స్థాయి లో సమతుల్యత గీస్తూ పోతే వోరిగేది ఏమీ లేదు. దేవుడు పెట్టిన స్థాయి మాత్రం మొషే చేసిన సూచక క్రియలు మరియు ఆయన దేవునితో ముఖా ముఖిగా మాట్లాడటం. ఆ రెండు విషయాలలో మొహమ్మద్ గారు మొషే కి సమతుల్యులు కారు.

యేసు మొషే లాగా ఇష్రాఎలీయులలో నుండి వచ్చిన వాడు, మోషేలాగా దేవునివడ్డ నుండి యే మధ్య వర్తి అవసరం లేకుండా ప్రవచనములు మరియు దైవ వాక్కు పొందిన వాడు, మొషే లా ఎన్నో సూచక క్రియలు మరియు ఆశ్చర్య కార్యములు జరిపించిన వాడు.

3 ) అతని నోట నా మాటల నుంచుదును : మొహమ్మద్ గారి నోట దేవుడే తన మాటలనుంచటం అనేది మన మూడవ అంశం. ఈ అంశం పరిశీలించటానికి ముందు క్రైస్తవ విశ్వాసం ఏమిటో చెబుతాను. క్రైస్తవ విశ్వాసం బైబిల్ గ్రంధ ఆధారంగా ప్రతి ప్రవక్త దేవుడు తన నోటిలో ఉంచిన మాటలనే పలుకుతాడు దానినే బైబిల్ గ్రంధం లో నమోదు చేయడం జరిగింది. ఈ అంశాన్ని వివరిస్తూ షఫీ గారు మొహమ్మద్ అల్లాః చెప్పిన మాటలనే కురాన్ లో నమోదు చేసాడు కానీ ఆయన మనసులో మాటలను ఎప్పుడూ దైవ వాక్యం గా నమోదుచేయలేదు అని వివరించారు. అందుకు ఆయన వాడిన సురా 53 :3 ను చూద్దాం “అతను తన మనో వాంచలకు తల యోగ్గి మాట్లాడడు” అని వ్రాసి ఉంది. ఆలోచించి చూస్తే కురాన్ గ్రంధం యొక్క మొట్టమొదటి సురా అల్ ఫాతిహా “బిస్మిల్లః” అనే పదం తో మొదలవుతుంది. అంటే అల్లాః పేరుతో మొదలుపెట్టడం అన్న మాట. మరి కేవలం అల్లాః మాటలే కురాన్ లో ఉంటె అల్లః యే అల్లాః పేరుతో మొదలు పెట్టినట్టా? 2 వ వచనం అల్లాః కు స్తుతి కలుగును గాకా అని ఉంది అంటే అల్లాః యే అల్లాః ను స్తుతిన్చుకున్నాడా? ఈ ప్రశ్నలకు షఫీ గారు సమాధానం చెప్పాలి. ఇదే వాక్యమును షఫీ గారు వాడుతూ అల్లాః పేరిట అనే మాట చెప్పడం వల్ల అల్లాః మాటలనే చెబుతున్నట్టు ఇంకెవరి మాటలు చెప్పనట్టు షఫీ గారు చెప్పుకొచ్చారు. కాక పోతే బిస్మిల్లా అనే పద కూడా కురాన్ లో ఒక భాగమే అని ఆయన మరిచిపోయారు. మరి అది మొహమ్మద్ గారు పలికిన మాటా?లేక అల్లాః పలికిన మాటా?

4 ) నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును ( దేవితీయో 18 :19) 5 ) అతడు నా నామమున చెప్పు నా మాటలను, – ఈ రెండు మాటలు కూడా పై విషయం తో మూడు పది ఉన్నాయి. ముఖ్యం గా ఇదే ద్వితీయోపదేశ కాండం 18 వ అధ్యాయం ను ఇంకొంచం ముందుకు 20 మరియు 21 వ వచనములు చదివితే అసలు సంగతి బయట పడుతుంది: “అంతే కాదు యే ప్రవక్త యూ అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్త యూ చావ వలెను. మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమేట్లు తెలిసికొన గలము అని మీరనుకొనిన యెడల , ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగక పోయిన యెడలను ఎన్నడును నెరవేరక పోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు”.

ఇక్కడ ముస్లిం దావా ప్రచారకులకు మింగుడు పడని విషయం ఏమిటంటే మొహమ్మద్ గారు దేవుడు చెప్పని విషయాలను దేవుని వాక్యం గా చెప్పి తరువాత అవి సైతాను తన తో చెప్పించినట్టు ఒప్పుకోవడం. దీనినే సైతాను వచనాలు లేక సేటానిక్ వర్సెస్ అని కూడా అంటారు. సురా 53 : 19 -26 , సురా 22 : 52 ,53 , సురా 17 : 73 – 75 లో చెప్పబడిన ఈ మాటల నేపధ్యం చూస్తే మనకు అసలు విషయం యిట్టె తెలిసి పోతుంది. ఈ విషయం ఇబ్న్ ఇషాక్ రచించిన సూరత్ అల్ రసూల్ అల్లాః మరియు అల్-తబరి యొక్క గ్రంధం లలో స్పష్టంగా చూడ వచ్చు.

కనుక మనం గమనించిన వాక్య భాగాల నేపధ్యం లో మొహమ్మద్ గారు మొషే వంటి ప్రవక్త కాలేరు. ఈ రుజువులు కాక మొషే తన జీవిత కాలం లో ఎప్పుడూ దయ్యములచేత పట్టబడిన వానిగా అనుకోలేదు కానీ మొహమ్మద్ గారు అలా అనుకున్నారు -( సీరత్ రసూల్ అల్లాః పేజి నం 106 ), మొషే ఎప్పుడూ ఆత్మహత్యా యత్నం చేయలేదు, మొహమ్మద్ గారు చేసారు – (తబరి 1115 , 6 వ వాల్యూం, పేజీ నం 76 ) మరియు అతి ముఖ్యం గా మొషే తను తెచ్చిన దైవ వాక్యమును ఇంకొ దైవ వాక్యం చె చక్క దిద్ద లేదు కానీ మొహమద్ గారు కురాన్ లో పలికిన ఎన్నో వాక్యాలను వేరొక కురాన్ వాక్యాల తో చక్క దిద్దారు. దీనినే ఆంగ్లము లో అబ్రోగేషణ్ అని అంటారు.

ఇక షఫీ గారు నూతన నిబంధన గ్రంధమును ఉపయోగించి తనకు కావలసిన విషయమును రుజువు పరచుకోనేందుకు చేసిన ప్రయత్నమును తూర్పారబడదాం: ఇందికు గాను ఆయన వల్లించిన వాక్య భాగం యోహాను 1 : 19 – 25 “నీవెవడవని అడుగుటకు యూదులు యేరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నోద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్షమిదే. అతను యెరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు – కాననెను – నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు నీవెవరవు? మమ్మును పంపిన వారికి మేము ఉత్తరమియ్య వలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొను చున్నావని అతనినడిగిరి. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దమును అని చెప్పెను. పంప బడిన వారు పరిసయ్యులకు చెందిన వారు. వారు నీవు క్రీస్తువైనను, ఎలియా వైనను ఆ ప్రవక్త వైనను కాని యెడల ఎందుకు బాప్తీస్మమిచ్చు చున్నావని అతనినడుగగా – యోహాను – నేను నీళ్ళలో బాప్తీస్మమిచ్చు చున్నాను గాని నా వెనుక వచ్చుచున్న వాడు మీ మధ్య ఉన్నాడు; మీరాయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను.”
ఇక్కడ ఆప్రవక్త అన్న పదాన్ని షఫీ గారు పదే పదే చెబుతూ, ఆ ప్రవక్త ఎవరు? అని అడగటం మరియు ఆ ప్రవక్త గురించి ఎవరూ ఎక్కడా వ్రాయలేదు అని చెబుతూ ఆ ప్రవక్త అంటే మొహమ్మద్ అని చెప్పినట్టు చూడగలం. దీని గురించిన వివరణకు వెల్ల టానికి ముందు ఒక చిన్న ప్రశ్న ఏమిటంటే షఫీ గారు అసలు ఆయన వల్లించిన వాక్య భాగాన్ని అర్థం చేసుకున్నా రా? ఎందుకంటే అడిగిన ప్రశ్న లో నే ఆయనకు సమాధానం ఉంది – “వారు నీవు క్రీస్తువైనను, ఎలియా వైనను ఆ ప్రవక్త వైనను కాని యెడల ఎందుకు బాప్తీస్మమిచ్చు చున్నావని అతనినడుగగా” అంటే పరిసెయ్యులు సూచించిన ఆ ముగ్గురు ప్రవక్త ల వంటివారు మాత్రమే బాప్తీస్మం వంటి అధికార పూరిత మైన ధర్మ సంప్రదాయమును ఇస్తారు, ఒక వేళ యోహాను ఆ ముగ్గురి లో ఒకరు కాక పోతే బాప్తీస్మం ఎందుకు ఇస్తున్నాడు అని అడిగారు!! మరి మొహమ్మద్ గారు ఆ ప్రవక్త అయితే ఎంత మందికి బాప్తీస్మం ఇచ్చారో షఫీ గారు వివరించాలి.
ఇక వివరణ చూద్దాం : ఇక్కడ సందర్భమును తెలుసుకోవడం చాలా ముఖ్యం. “పంప బడిన వారు పరిసయ్యులకు చెందిన వారు” అని షఫీ గారు వల్లించిన వాక్యం లో స్పష్టంగా ఉంది. పరిసయ్యులు అప్పటి యూదా ధర్మములో వారి లేఖనముల ను అర్థం చేసుకున్నంత మేరకు క్రీస్తు, యిర్మియా మరియు ఎలియా కొరకు వేచిఉండే వారు. ఆ ప్రవక్త అనగా ఇర్మియా ప్రవక్త అని పరిసయ్యుల విశ్వాసం మత్తయి 16 : 14 . బైబిల్ ప్రకారం క్రైస్తవ విశ్వాసం మాత్రం ఆ ప్రవక్త మరియు క్రీస్తు ఒకరే నని. ఎందుకనగా యేసు మెస్సియా తానేనని చెప్పడం మరియు ఆ ప్రవక్త కూడా ఆయనే నని అపోస్తలుల కార్యములు 3 :21 -22 లో నమోదు చేయబడి ఉన్దికనుక. షఫీ గారు మాత్రం ఆ ప్రవక్త గురించి ఎక్కడా రాయలేదు అని చెబుతూ నే ఆయనే మొహమ్మద్ అని చెబుతున్నారు. ఎక్కడా రాయక పోతే షఫీ గారికి ఎలా తెలిసిందో ఆయనే చెప్పాలి. ఒక వేళ షఫీ గారు లేదు లేదు ఆ ప్రవక్త అంటే ద్వితీయోపదేశ కాండం లో చెప్పబడిన మొషే వంటి ప్రవక్త ఆయనే మొహమ్మద్ అని వాదిస్తే అది కూడా షఫీ గారిని తప్పుగా నిరూపిస్తుంది, ఎందుకంటె ఒక వేళ ఆ ప్రవక్త ఇస్మాయేలీయులలో నుండి రావలిసి ఉంటె (షఫీ గారు వాదిస్తున్నట్టు) పరిసయ్యులు వెళ్లి యూదుడైన యోహానును ఎందుకు అడగాలి? ఒక వేళ షఫీ గారు కాదు కాదు యూదులు ప్రవక్త ఇష్మాఎలీయుడా లేక ఇస్రాయేలీయుడా అన్న విషయం లో పొరబడ్డారు అని చెబితే అదే పొరబాటు ప్రవక్త మరియు క్రీస్తు ఒకరే అన్న విషయం లో కూడా పడి ఉండవచ్చు కదా!!
ఇక ఆదరణ కర్త వద్దకు వద్దాం – షఫీ గారి యోహాను 14 :16 ను వల్లిస్తూ “మీ యొద్దకు ఎలపుడునూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణ కర్త ను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును” అని చెప్పి ఆ ఆత్మ ఇంకెవరో కాదు మొహమ్మద్ గారే అని చెప్పుకొచ్చారు. ఈ వాక్య భాగాన్ని సంపూర్ణం గా చదివి చూద్దాం “నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మ ను మీకనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును”.
ఇదే అధ్యాయంలో ఉన్న ఇంకొ మాటను కూడా చూద్దాం ” ఆదరణ కర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ (లేక ఉత్తర వాది) సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.” యోహాను 14 : 26
అలాగే యోహాను 15 :26 , 27 “తండ్రి యెద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణ కర్త, అనగా తండ్రి యెద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటినుండి నా యెద్ద ఉన్న వారు కనుక మీరును సాక్ష్యమిత్తురు”
యోహాను 16 :7 – 15 “అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వేల్లిపోవుట వలన మీకు ప్రయోజన కరము; నేను వెళ్ళని యెడల ఆదరణ కర్త మీ యొద్దకు రాడు; నేను వెళ్ళిన యెడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును ఒప్పుకొన జేయును. లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాదికారి తీర్పు పొందియున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన జేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింప లేరు. అయితే ఆయన, సత్య స్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును;ఆయన తనంతట తానే ఏమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి, సంభవింప బోవు సంగతులను మీకు తెలియ జేయును.ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును. తండ్రికి కలిగిన వన్నియు నావి, కనుక ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.”
పై చెప్పబడిన వచనాలను చదివితే ఆదరణకర్తను గురించి మనకు యిట్టె అర్థం అవుతుంది:

సత్య స్వరూపియగు ఆత్మను – పంపబడిన ఆదరణకర్త ఆత్మ అయి ఉండాలి – మరి మొహమ్మద్ గారు ఆత్మనా?
ఎల్లప్పుడు ఉండుటకై – పంప బడిన ఆదరణ కర్త ఎల్లప్పుడూ ఉండాలి – మొహమ్మద్ గారు చనిపోయారని ఇస్లామీ సాహిత్యం చెబుతోంది
లోకము ఆయనను చూడదు – మొహమ్మద్ గారిని లోకము చూడలేదని ముస్లింలు చెప్పగలరా?
ఆయనను ఎరుగదు – మొహమ్మద్ గారిని లోకము ఎరుగదని ముస్లిములు చెప్పగలరా?
పొందనేరదు – మొహమ్మద్ గారిని పొంద వచ్చునని ఇస్లామీ సాహిత్యం చెబుతోందా? – పరిశుద్దాత్మను పొందుట క్రైస్తవులకు సహజం.
మీలో ఉండును – మొహమ్మద్ ముస్లిములలో ఉన్నారా? – పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తును నమ్మిన వారిలో ఉన్నాడు అన్నది బైబిల్ బోధ.
నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ – మొహమ్మద్ గారు యేసు నామములో పంపబడ్డారా?
నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. – మొహమ్మద్ గారు యేసు చెప్పిన సంగతులు అన్నీ చెప్పరా?
నేను పంపబోవు ఆదరణ కర్త – మొహమ్మద్ గారు యేసు పంపగా వచ్చిన వారా?
నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును, మీరు మొదటినుండి నా యెద్ద ఉన్న వారు కనుక మీరును సాక్ష్యమిత్తురు – మొహమ్మద్ గారు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చారా? ఇచ్చిఉంటే ఆ సాక్ష్యం శిష్యుల సాక్ష్యం తో ఏకీభ విస్తోందా?
సర్వ సత్యములోనికి నడిపించును – మొహమ్మద్ గారు తెచ్చిన కురాన్ లో సర్వ సత్యం ఉందా? మరి కురాన్ సర్వ సత్య పరిపూర్ణం అయితే దీనికి హద్దీసు వివరణ ఎందుకు?
తనంతట తానే ఏమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి – మొహమ్మద్ గారు తనంతట తాను ఏదీ బోధించ లేదా? మరి కురాన్ లోని మొదటి సురా సంగతి ఏమిటి? అల్లాః యే అల్లాః పేరిట కురాన్ ను ఆరంభించాడా? దేవుని నామం పేరిట ఆయన పలికిన సాతాను మాటల సంగతి ఏమిటి?
సంభవింప బోవు సంగతులను మీకు తెలియ జేయును – మొహమ్మద్ గారు తన పరిపూర్ణ మైన కురాన్ లో సంభావించ బోవు భవిష్య వాని చేసారా? చేస్తే అవి జరిగాయా?
నా వాటిలోనివి తీసుకొని – క్రీస్తు నామములో మొహమ్మద్ ఎప్పుడు బోధించారు? క్రీస్తు మాటలను ఎప్పుడు బోధించారు?
నన్ను మహిమ పరచును – మొహమ్మద్ గారు క్రీస్తును మహిమ పరిచారా? అసలు ఇస్లాం ప్రకారం అల్లాః ను తప్ప ఇంకెవరినైనా మహిమ పరచ వచ్చా?
ఇన్ని విషయాలకు సమాధానం ఇంత వరకు యే ముస్లిం దావా ప్రచారకుడు ఇవ్వలేదు అన్నది వాస్తవం. ఎందుకంటే మొహమ్మద్ గారు ఈ సందర్భం లో ఆదరణ కర్తగా నిలబడలేరు కనుక.
ఇక ఈ ప్రశ్నలకు సమాధానం లేని షఫీ వంటి పెద్ద మనుషులు ఆదరణ కర్త ఒక శక్తి అని దానిని బట్టి క్రైస్తవ్యం చీలిపోయిందని వెర్రి పలుకు పలుకుతూ ఉంటారు. కాక పోతే త్రిఏక దేవుని ఆరాధించే సాంప్రదాయిక క్రైస్తవ్యం ఎప్పుడూ పరిశుద్దాత్ముడిని ఒక వ్యక్తిగా, శృష్టి కర్త గా ఆరాధించారు. ఆయన క్రైస్తవులలో ఉంటూ క్రైస్తవులకు నీతి మార్గం చూపెడుతున్నారు అన్నది క్రైస్తవ సిద్ధాంతం. ఆయన సంఘమునకు వరములు, ఫలమును అనుగ్రహించు దేవదేవుడు అని నమ్ముచున్నారు. పరిశుద్ధాత్ముడు క్రైస్తవులలో ఉంటారు కనుకనే ప్రతి క్రైస్తవుడు దేవుని ఆలయము అని 1 కొరింథీ 6 :19 వ్రాయబడి ఉంది. అజ్ఞానము చేత మాట్లాడే మాటలను క్రైస్తవులు చురుకుగా ఎదిరించగలరు అన్న విషయం షఫీ గారి వంటి దావా ప్రచారకులకు ఎప్పుడు తెలిసి వస్తుందో.

షఫీ గారు చాక చక్యంగా 1 యోహాను 4 : 1 ని వల్లిస్తూ అబద్ద ప్రవక్తలను కూడా ఆత్మ గా వర్ణించడం జ

category: